Home » Entertainment » Anchor Suma Cash Show Rare Record
Entertainment

Anchor Suma : మరో అరుదైన మైలు రాయి చేరిన యాంకర్‌ సుమ ‘క్యాష్‌’ షో

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: May 9, 2022, 4:30 pm
Advertisement

Anchor Suma : యాంకర్‌ గా సుమకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన షో ల్లో క్యాష్ షో ఒకటి అనడంలో సందేహం లేదు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న క్యాష్ దొరికినంత దోచుకో కార్యక్రమం మరో అరుదైన మైలు రాయిని చేరి సుమ కు అరుదైన ఘనత ను తెచ్చి పెట్టింది. అసలు విషయం ఏంటీ అంటే యాంకర్ సుమ హోస్టింగ్‌ చేస్తున్న క్యాష్ కార్యక్రమం 200 ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అయ్యేందుకు సిద్దం అయ్యింది. ఒక రియాల్టీ ఎంటర్‌ టైన్మెంట్‌ షో 200 ఎపిసోడ్‌ లు ప్రసారం అంటే మామూలు విషయం కాదు.

Advertisement

డైలీ షో లు అయితే రెండు వందల ఎపిసోడ్‌ లు సరే అనుకోవచ్చు. కాని వారం వారం వచ్చే క్యాష్ షో రెండు వందల ఎపిసోడ్‌ లను పూర్తి చేసుకోవడం అంటే ఖచ్చితంగా అద్బుతమైన రికార్డ్‌ అనడంలో సందేహం లేదు. సుమ క్యాష్ షో కొన్నాళ్లు అయిన తర్వాత జీన్స్ అనే కార్యక్రమాన్ని చేసింది. మద్యలో జీన్స్ రావడం వల్ల క్యాష్ షో ఎపిసోడ్స్ తక్కువ అయ్యాయి. లేదంట మరిన్ని ఎపిసోడ్‌ లను సుమ పూర్తి చేసి ఉండేది అంటూ ఈటీవీ మరియు మల్లె మాట టీమ్‌ మెంబర్స్ మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

anchor suma Cash Show rare record

Advertisement

ఈటీవీ మరియు మల్లెమాల వారు క్యాష్ షో కు ప్రత్యేకంగా శ్రద్ద పెట్టడంతో మంచి కంటెంట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకే ప్రతి ఒక్కరు కూడా క్యాష్ కార్యక్రమాన్ని ఇష్టపడుతున్నారు. క్యాష్ షో వల్ల మంచి గుర్తింపును సుమ దక్కించుకుంది. ఆ షో వల్లే ప్రీ రిలీజ్‌ ఈవెంట్స్ కు ఈమెకు అవకాశం వచ్చింది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. మొత్తానికి క్యాష్ 200 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకోవడంతో సుమ టీమ్‌ సెలబ్రేట్‌ చేసుకుంది. 200 ఎపిసోడ్‌ కు గాను ఎఫ్ 3 యూనిట్‌ సభ్యులు తమన్నా, సోనాల్‌ చౌహాన్‌, అనీల్‌ రావిపూడి మరియు సునీల్‌ లు హాజరు అయ్యారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి