
Anchor Suma Counters on Lobo Umadevi Romance in Cash Promo
Anchor Suma : బిగ్ బాస్ ఇంట్లో ఐదో సీజన్‌లో లోబో, ఉమాదేవీలు చేసిన హంగామా అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ చేసిన రొమాన్స్‌కు జనాలకు పిచ్చెక్కిపోయింది. ఈ లేటు ఘాటు రొమాన్స్ చూడలేకపోయిన జనాలు ఈ ఇద్దరినీ త్వరగానే ఇంటి నుంచి పంపించేశారు. అయితే లోబోతో ఆ భంగు అనే పదాన్ని మాత్రం ఉమా దేవీ ఆపడం లేదు. భంగు అంటూ ఎక్కడపడితే అక్కడే రొమాన్స్ చేసేస్తుంటుంది ఉమాదేవీ.
కార్తీక దీపం భాగ్యంగా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఉమా దేవీకి బిగ్ బాస్ షోతో చెడ్డ పేరు వచ్చింది. బిగ్ బాస్ ఇంట్లో ఉమా దేవీ వాడిన పదజాలం, పెట్టుకున్న గొడవలు అన్నీ కూడా కాంట్రవర్సీకి దారి తీశాయి. దారుణమైన బూతులతో ఉమా దేవీ రెచ్చిపోయింది. ఆమె మాట్లాడిన మాటలకు బిగ్ బాస్ టీం కూడా తలపట్టుకున్నట్టుంది. ఎడిటింగ్‌లో లేపి అవతల పారేశాడు. నాగార్జున సైతం ఆమెకు అక్షింతలు వేశాడు.
Anchor Suma Counters on Lobo Umadevi Romance in Cash Promo
మొత్తానికి ఈ ఇద్దరూ బయటకు వచ్చారు. బయటి షోల్లోనూ రొమాన్స్ చేశారు. ఇక తాజాగా సుమ క్యాష్ షోకు గెస్టులుగా వచ్చారు. ఇందులోనూ ఈ ఇద్దరూ నానా హంగామా చేశారు. ఎంట్రీలోనే రొమాన్స్ మొదలుపెట్టేశారు. పక్కన సుమ ఉన్నా కూడా పట్టించుకోకుండా.. లేటు ఘాటు రొమాన్స్ చేశారు. ఇక వీరి రొమాన్స్ చూడలేకపోయిన సుమ ఇద్దరి జంట మీద కౌంటర్లు వేసింది. షో మొత్తం మీ రొమాన్స్ చూడలేక చావాలి అంటూ పరువుతీసింది.
మొత్తానికి లోబో, ఉమా దేవీలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇలా బుల్లితెరపై, సోషల్ మీడియాలో అంతటా సందడి చేస్తున్నారు. బిగ్ బాస్ తరువాత ఉమాదేవీకి సీరియల్స్‌లో అవకాశాలు తగ్గాయి. కొత్త సీరియల్లు చేయడం లేదు. కార్తీక దీపంలో కనిపించడం లేదు.
Black Hair : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న వర్క్ టెన్షన్స్ కారణంగా ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే…
Vegetables And Fruits : మన రోజువారీ ఆహారంలో కూరగాయలు, పండ్లు చాలా ముఖ్యమైనవి. అయితే మనకీ దొరికే ప్రతి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Ranabaali Movie : టాలీవుడ్ Tollywood యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ Vijay Devarakonda మరోసారి తన సినిమా ఎంపికతో…
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో మరోసారి 'రెడ్ బుక్' Red Book అంశం అధికార, ప్రతిపక్షాల…
Indiramma Houses : పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల…
Amaravati Capital : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా 'అమరావతి' ఒక ప్రధాన అంకంగా నిలిచింది. 2014లో విభజన…
Loan: లోన్ తీసుకోవాలంటే ముందుగా మంచి సిబిల్ స్కోర్ cibil score ఉండాలి ఆ తర్వాత బ్యాంకుల Banks చుట్టూ…
This website uses cookies.