Home » Entertainment » Anchor Suma Counters On Rahul Sipligunj
Entertainment

Anchor Suma : నాది అంతా అటాక్ చేయడమేన్న రాహుల్.. ఎంతమంది అంటూ సుమ నాటు ప్రశ్న

Authored By
Cinema Desk
The Telugu News | Published on: November 16, 2021, 11:40 am
Advertisement

Anchor Suma : రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ షోతో బాగా ఫేమస్ అయ్యాడు. అంతకు ముందు ప్రైవేట్ ఆల్బమ్స్ అంటూ యూట్యూట్‌లో నానా హంగామా చేసేవాడు. నాటు పాటలు, పల్లె పాటలు అంటూ మాస్ సాంగులతో, ప్రైవేట్ ఆల్బమ్‌లతో హల్చల్ చేసేవాడు. ఇక బిగ్ బాస్ షోకు వెళ్లిన తరువాత రాహుల్ ఫాలోయింగ్ పెరిగింది. క్రేజ్ మారింది. స్టార్ స్టేటస్ వచ్చింది. ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ అంటే ఓ బ్రాండ్ అయింది.

Advertisement

మొత్తానికి రాహుల్ చిచ్చా అయిపోయాడు. సింగర్, నటుడు, ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆల్బమ్‌లు చేసుకుంటూ బిజీగా ఉన్న రాహుల్ బిజినెస్ కూడా ప్రారంభించాడు. ఊకో కాక అంటూ బట్టల దుకాణాలను ఓపెన్ చేస్తున్నాడు. అలా హైద్రాబాద్, తెలంగాణ ఇతర జిల్లాల్లోనూ బ్రాంచ్‌లు ఓపెన్ చేశాడు. మొత్తానికి మంచి ఫాంలో ఉన్న రాహుల్ ఇప్పుడు సుమ హోస్ట్ చేస్తోన్న క్యాష్ షోకి గెస్టుగా వచ్చాడు.

Anchor Suma Counters On Rahul Sipligunj

Advertisement

Anchor Suma : రాహుల్‌కు సుమ కౌంటర్లు..

అందులో అషూ రెడ్డి కూడా వచ్చింది. అయితే సుమ ఓ ప్రశ్నను అడిగింది. దానికి రాహుల్ చెప్పిన సమాధానం, సుమ వేసిన కౌంటర్ వైరల్ అవుతోంది.అమ్మాయిలకు అబ్బాయిలు ఏం ఇచ్చి ప్రపోజ్ చేస్తారు అని సుమ అడిగింది. నాకు అలాంటివన్నీ తెలియవక్క.. నచ్చిందా? డైరెక్ట్ అటాక్ చేయడమే.. ఏం పోరి అంటూ అడిగేస్తాను అని అన్నాడు.

ఎంత మంది మీద అటాక్ చేశావ్. ఎవరు నీకు ఓకే చెప్పారంటూ అలా కూపీ లాగడం స్టార్ట్ చేసింది. కానీ పక్కనే ఉన్న కుమార్ సాయి దాన్ని కనిపెట్టేశాడు. భయ్యో మొత్తం లాగేందుకు ప్రయత్నిస్తోందంటూ రాహుల్‌కు హింట్ ఇచ్చాడు. అలా మొత్తానికి రాహుల్ సీక్రెట్లను చెప్పకుండా ఆగిపోయాడు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి