Home » Entertainment » Anchor Suma Shares Covid Test Video Before Going Bigg Boss Telugu Season 5
Entertainment

Anchor Suma : భగవంతుడా? అంటూ సుమ ఆవేదన.. యాంకర్ వీడియో వైరల్

Authored By
Cinema Desk
The Telugu News | Published on: November 1, 2021, 9:15 am
Advertisement

anchor suma : యాంకర్ సుమ తన షోలతో ఎంత తీరిక లేకుండా గడుపుతున్నా.. అప్పుడప్పుడు కొన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. ఇంట్లో జరిగేవే కాకుండా, షూటింగ్ స్పాట్‌లో చోటుచేసుకునే ఫన్నీ ఇన్సిండెంట్‌ను కూడా ఆమె షేర్ చేస్తుంటారు. తాజాగా సుమ బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5కి గెస్ట్‌గా వెళ్లారు. అయితే వెళ్లగానే ‘తాము ఏదైతే నాగార్జున గారు అడిగితే బాగుండు అనుకుంటామో.. అలాగే నడుస్తోంది’ సుమ అనగానే.. నువ్వే కదా ఫోన్ చేసి చెప్తావ్ అని నాగార్జున కౌంటర్ వేస్తాడు.

Advertisement

anchor suma Shares covid Test video Before going Bigg boss telugu season 5

ఇక, సుమ హౌస్‌లోకి వెళ్లి గ్లాస్ డోర్‌ల మధ్య నిల్చుని కంటెస్టెంట్‌లతో ముచ్చటించారు. హౌస్‌లో జరిగే పరిణామాలను వారి వద్ద ప్రస్తావించారు. అంతేకాకుండా సిరి.. షణ్ముఖ్‌కు మద్దు పెట్టడాన్ని కూడా ప్రస్తావించింది. అయితే బిగ్‌బాస్ హౌస్‌ షోకి వెళ్లడానికి ముందు జరిగిన కరోనా టెస్ట్‌కు సంబంధించిన వీడియోను సుమ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ సందర్భంగా వచ్చే ఏడాది వరకైనా కరోనా లేకుండా చూడు భగవంతుడా.. అంటూ సుమ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ప్రతి సారి కరోనా టెస్ట్‌లు చేయించుకోవాల్సి వస్తుందని పేర్కొంది.

Advertisement

anchor suma : బిగ్ బాస్ ఇంట్లోకి సుమ

anchor suma Shares covid Test video Before going Bigg boss telugu season 5

లాస్ట్ టైమ్ కూడా ఇలానే టెస్ట్ చేసుకోని బిగ్‌బాస్‌కు వెళ్లినట్టుగా సుమ తెలిపింది. ఏదో చెప్పబోతున్నట్టుగా బిల్డప్ ఇచ్చిన సుమ..ఈసారి కడా టెస్ట్ చేసుకుని లోపలికి వెళ్తున్నామని అన్నారు. వచ్చే సంవత్సరానికి ఈ అవసరం లేకుండా పోవాలి భగవంతుడా.. అని ప్రార్థించారు. ఇక, గత బిగ్‌బాస్ సీజన్‌లో కూడా సుమ తన గెస్ట్ అప్పియరెన్స్‌తో సందడి చేసిన సంగతి తెలిసిందే.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి