Home » Entertainment » Anchor Syamala Funny Answer To Netigen
Entertainment

Anchor Syamala : మీలాంటిదాన్నే పెళ్లి చేసుకుంటానన్న నెటిజన్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన యాంకర్ శ్యామల

Authored By
Sam C
The Telugu News | Published on: March 7, 2022, 2:30 pm
Advertisement

Anchor Syamala : బుల్లితెర యాంక‌ర్‌గానే కాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న ముద్దుగుమ్మ యాంక‌ర్ శ్యామ‌ల. దాదాపు పదేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఫలితంగా ఎంతో మంది అభిమానాన్ని అందుకోవడంతో పాటు వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ సీనియర్ బ్యూటీ.. రాజకీయాల్లోనూ కాలు మోపింది. ఇక, ఇటీవలే ఆమె భర్త ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా యాంకర్ శ్యామల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్లతో చిట్ చాట్ చేసింది. ఇందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ చేసిన ఆస‌క్తిర వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Advertisement

యాంక‌ర్ శ్యామ‌ల.. ఇటీవ‌ల కాలంలో తెగ ట్రెండింగ్‌లోకి వ‌చ్చింది. ఆర్జీవీ కామెంట్లతో శ్యామల పేరు మారు మ్రోగింది. యాంకర్ శ్యామల గత వారం ముంబైకి వెళ్లింది. షూటింగ్ నిమిత్తం ముంబైకి వెళ్లిన శ్యామల.. భీమ్లా నాయక్ సినిమాను చూడాలా? వద్దా? అనే డైలామాలో పడింది. ఇక శ్యామల తన హెయిర్ స్టైలిష్ట్ గురించి చెబుతూ అతని పరువుతీసేసింది. తాజాగా శ్యామల తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేసింది. ఇందులో ఒక్కొక్కరు ఒక్కో రకమైన ప్రశ్నను సంధించారు. కొందరు పర్సనల్ విషయాలను టచ్ చేశారు. బెస్ట్ ఫ్యామిలీ పిక్ ఏంటి.. తన కొడుకు ఇషాన్ గురించి ఇలా ప్రశ్నలు సంధించారు.

anchor syamala funny answer to netigen

Advertisement

Anchor Syamala : శ్యామ‌ల అదిరిపోయే పంచ్..

అయితే ఓ నెటిజ‌న్ మీ లాంటి అమ్మాయి ఉంటే చూడ‌రా, పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటున్నాను అని కామెంట్ పెట్టాడు. దీనికి స్పందించిన శ్యామ‌ల‌.. హైబ్రిడ్ పిల్ల‌.. ఒక్క‌టే పీస్ అంటూ సాయి ప‌ల్ల‌వి డైలాగ్ కొట్టింది. దీంతో అంద‌రు ఉలిక్కిప‌డ్డ‌రు. ప్ర‌స్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇదిలా ఉంటే వ‌ర్మ కొద్ది రోజుల క్రితం ఓ ఈవెంట్‌లో ఇన్నాళ్లు నాకు కనపడకుండా ఎక్కడున్నావ్ అంటూ స్టేజ్ మీద శ్యామలతో పులిహోర కలిపేశాడు వర్మ. దీంతో శ్యామల తెగ సిగ్గుపడిపోయింది. ఆర్జీవీ కామెంట్లు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. దీంతో యాంకర్ శ్యామల పేరు నెట్టింట్లో మార్మోగిపోయింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి