
Prabhas : ప్రభాస్ రాధే శ్యామ్ నుంచి మరో సర్‌ప్రైజ్ రాబోతుంది ఫ్యాన్స్ ఇక రెడీగా ఉండాల్సిందే. ఇన్నాళ్ళు అభిమానులు.. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ మిస్ అయిన సర్‌ప్రైజెస్ అన్ని వరసబెట్టి ఇవ్వబోతున్నారట రాధే శ్యామ్ మేకర్స్. రీసెంట్ గా వాలెంటైన్స్ డే రోజున ఫస్ట్ గ్లింప్స్ వచ్చి అభిమానులను .. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ గ్లింప్స్ తర్వాత టీజర్ గాని ట్రైలర్ గాని వస్తే బావుటుందని ప్రభాస్ అభిమానులు ఆశపడుతున్నారు. ఈ క్రమంలోనే రాధే శ్యామ్ నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
another-surprise-from-prabhas-radhae-shyam-trailer-release-date-is-fixed
అందుకు ఎంతో దూరం లేదని లేటేస్ట్ అప్‌డేట్. మార్చ్ 11 న మహా శివరాత్రి పండుగ సందర్భంగా రాధే శ్యామ్ నుంచి ట్రైలర్ రాబోతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ ట్రైలర్ లో చాలా అంశాలనే చూపించబోతున్నట్టు తెలుస్తోంది. వాస్తవంగా రాధే శ్యామ్ ఫస్ట్ గ్లింప్స్ బావున్నప్పటికి కొంతమందిని బాగా డిసప్పాయింట్ చేసింది అన్న కామెంట్ కూడా వినిపించాయి. ఆ కామెంట్స్ చిత్ర యూనిట్ వరకు వెళ్ళాయట. అందుకే ట్రైలర్ ని అందరూ మెచ్చే విధంగా రెడీ చేస్తున్నట్టు లేటెస్ట్ అప్‌డేట్. ఇక ఈ సినిమాని పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా దర్శకుడు రాధకృష్ణ తెరకెక్కిస్తున్నాడు.
250 కోట్ల భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ కి జంటగా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు, బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. జూలై 30 న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాతో ప్రభాస్ చెల్లి ప్రశీద నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతోంది. ఇక ప్రభాస్ నటిస్తున్న సలార్ సెకండ్ షెడ్యూల్ ఈ నెల 22 నుంచి హైదరాబాస్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలవబోతోంది. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.