Anu Emmanuel : చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయం ఉన్నా కూడా అదృష్టం లేక దారుణమైన పరిస్థితిని చవి చూస్తుంది అందాల ముద్దుగుమ్మ అను ఎమ్యాన్యుయేల్. మజ్ను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఎన్నారై బ్యూటీ . తొలి సినిమాతో హిట్ అందుకున్న ఈ బ్యూటీకి మంచి ఆఫర్సే వచ్చాయి. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో ఛాన్స్ లు రావడంతో అమ్మడు స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారంతా. కాని అదృష్టం బాగో లేక అను పరిస్థితి దారుణంగా మారింది. అవకాశాలు తలుపు తట్టడం మానేశాయి. ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య’ రెండూ కూడా ఫ్లాప్ అవ్వడంతో అను ఎమ్మాన్యుయేల్ కి తెలుగులో అవకాశాలు తగ్గాయి.
నాగచైతన్యతో చేసిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా కూడా ఏవరేజ్ గా ఆడింది. ఆ తర్వాత చేసిన పలు చిత్రాలు కూడా అనుకి పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయాయి. అనూ ఇమ్మానియేల్‌కి అజ్ఞాత వాసి సినిమాలో హీరోయిన్‌గా అవకాశం రాగానే ఉబ్బి తబ్బిబ్బై తన స్టార్ డం ఏ సమంతనో, పూజా హెగ్డే రేంజ్‌లోనో ఊహించుకుంది. కానీ, త్రివిక్రమ్ రొటీన్ ఫార్ములాతో పవన్ తో పాటు ఆయన అభిమానులకు షాకిచ్చాడు. దాంతో ఎన్నో ఆశలు పెట్టుకొని భారీ హిట్ దక్కించుకొని వెలిగిపోవాలనుకున్న అనూ ఇమ్మానియేల్ అడ్రస్ లేకుండా పోయింది. పెద్ద హీరోలతో నటించినా కూడా ఇప్పటికీ ఈ అమ్మడు ఒక్క ఆఫర్ కూడా అంది పుచ్చుకోలేకపోతుంది.
అను ఎమ్మాన్యుయేల్ కెరీర్ సజావుగా సాగడం లేదు. ఈ క్రమంలో ఆమె ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతికృష్ణని వివాహం చేసుకోవాలని భావిస్తున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. 2017లో గోపిచంద్ హీరోగా జ్యోతికృష్ణ ఆక్సీజన్ అనే సినిమా తెరకెక్కించాడు. ఇందులో అను ఎమ్యాన్యుయేల్ కథానాయికగా నటించింది. ఈ సినిమా షూటింగ్‌లో అను, జ్యోతికృష్ణల మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళేలా కనిపిస్తుందని వార్తలు రాశారు. ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నట్టు తెలుస్తుండగా, త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారని తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.