Home » Entertainment » Anu Emmanuel Love Afair With Star Hero Brother
Entertainment

Anu Emmanuel : స్టార్ హీరో త‌మ్ముడుతో అను ఇమ్మాన్యుయేల్‌ ప్రేమాయణం..!

Authored By
mallesh
The Telugu News | Published on: December 22, 2021, 1:40 pm
Advertisement

Anu Emmanuel : బ్యూటిఫుల్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌ టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్‌గా నటించింది. అయితే, ఈ భామ నటించిన చిత్రాల్లో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ పిక్చర్ తప్ప మిగతా సినిమాలన్నీ కూడా బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో సత్తా చూపలేకపోయాయి. ఈ సంగతులు అలా ఉంచితే.. ఈ భామకు సరైన పాత్ర దొరికితే తన సత్తా చూపుతుందని పలువురు సినీ పరిశీలకులు అంటున్నారు.అను ఇమ్మాన్యుయేల్‌ నటించిన ‘మహా సముద్రం’ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సినిమాపైన భారీ అంచనాలే ఉన్నాయి.

Advertisement

Anu Emmanuel : అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్‌ మధ్యన ఉంది ‘ప్రేమ కాదట’.. !

అయితే, చిత్రం మాత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. అను ఇమ్మాన్యుయేల్‌ ప్రజెంట్ అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో కథనాయికగా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా తన కెరీర్ సెట్ అయిపోతుందని అను అనుకుంటుందట. ఫుల్ రొమాంటిక్ స్టోరిగా వస్తున్న ఈ సినిమాపైన భారీ అంచనాలే పెట్టుకుందట అను.. ఈ చిత్ర టైటిల్ ‘ప్రేమ కాదట’. కాగా, అను ఇమ్మాన్యుయేల్‌, అల్లు శిరీష్ మధ్య కూడా ప్రేమాయణం ఉంది చాలా కాలం నుంచి వార్తలొస్తున్నాయి. వాటిని నిజం చేసేలా టైటిల్ ఉందని కొందరు అభిమానులు చర్చించుకుంటున్నారు.

anu emmanuel love afair with star hero brother

Advertisement

టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్‌కు కూడా ఇప్పటి వరకు సరైన హిట్ సినిమా పడలేదు. ఈ నేపథ్యంలోనే ‘ప్రేమ కాదట’ మూవీపైన హీరో కూడా హోప్స్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే, అను, శిరీష్ మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ ఉందనే వార్తలు చాలా కాలం నుంచి వస్తున్నప్పటికీ వాటిపై ఇంతవరు శిరీష్ కాని అను కాని స్పందించలేదు. కేవలం సినిమా కోసమే వారి కలిసి పని చేస్తున్నారని, గుడ్ ఫ్రెండ్స్‌గా వారిరువురు ఉన్నారని తెలుస్తోంది. చూడాలి ‘ప్రేమ కాదట’ సినిమా ద్వారా వీరికి సక్సెస్ వస్తుందో లేదో..

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి