
Anusha Shetty : ఎట్టకేలకు పెళ్లి విషయం బయట పెట్టిన అనుష్క శెట్టి... ఆ స్టార్ క్రికెటర్ తో...?
Anusha Shetty : తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్ అనుష్క శెట్టి. అభిమానులు ఈమెను స్వీటీ అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు సాధించిన స్వీటీ 40 ఏళ్లు దాటినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. అయితే గతంలో స్వీటీ పై పలు రకాల రూమర్స్ వచ్చినప్పటికి అవి ఏమీ కూడా నిజం కాలేదు. అయితే తాజాగా మరోసారి ఆమె పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే ప్రస్తుతం స్వీటీ ఓ క్రికెటర్ ను పెళ్లి చేసుకోబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే పూర్తి కథనం చదవాల్సిందే.. అయితే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే రెండు సన్నివేశాలు మూడు పాటలు బాడీ షో చేస్తే సరిపోదు సినిమా మొత్తాన్ని భుజాలపై ఎత్తుకొని ఒంటి చేత్తో నడిపించగల సత్తా కూడా ఉండాలి. అయితే అనుష్క శెట్టి సినీ ఇండస్ట్రీలో ఆ సత్తా నిరూపించి చూపించింది . మొదట్లో ఈమె కూడా అందాలను బాగానే ఆరబోసినప్పటికీ ఆ తర్వాత జేజమ్మ , రుద్రమదేవి, దేవసేన , భాగమతి వంటి పాత్ర లతో ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఈ విధంగా ఆమె భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. మరి ముఖ్యంగా డైరెక్టర్లకు నిర్మాతలకు లేడీ ఓరియంటెడ్ సినిమా అనగానే అనుష్క పేరు గుర్తిచ్చేలా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.
అయితే ఇంతటి స్టార్ డమ్ సాధించిన అనుష్క ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఆమె పెళ్లి మరియు రిలేషన్స్ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. గతంలో ఓ ప్రముఖ దర్శకుడు కుమారుడిని అనుష్క పెళ్లి చేసుకోబోతుందంటూ కూడా రూమర్స్ వచ్చాయి. ఇక అప్పట్లో అనుష్క వీటిని ఖండించింది.ఆ తర్వాత హీరో ప్రభాస్ తో అనుష్క రిలేషన్ లో ఉందంటూ పలు రకాల వార్తల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై వీరిద్దరూ స్పందించి తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని మా మధ్య అలాంటిదేమీ లేదంటూ చెప్పుకొచ్చారు. అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో పుకార్లు మాత్రం ఆగలేదు. ఇలా ఎన్నో ఏళ్లుగా అనుష్క పెళ్లిపై పలు రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ వాటిలో ఒకటి కూడా నిజం కాలేదు.
అయితే ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క తన పెళ్లి గురించి మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ వివాహ వ్యవస్థపై ఆమెకు నమ్మకం ఉందని పెళ్లికి నేనెప్పుడూ వ్యతిరేకం కాదని తెలియజేసింది. అంతేకాక సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని చెప్పుకొచ్చింది. దీంతో తాజాగా సోషల్ మీడియాలో అనుష్క పెళ్లి విషయంపై వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అనుష్క ఓ స్టార్ క్రికెటర్ తో రిలేషన్ లో ఉందని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్లు కథనాలు వినిపిస్తున్నాయి. అంతేకాక ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
Vijay Devarakonda -Naveen Polishetty : మొన్నటి వరకు టాలీవుడ్ సేఫెస్ట్ హీరో ఎవరంటే చాలామంది విజయ్ దేవరకొండ అని…
Central Government: మన దేశంలోని చిన్న వ్యాపారులకు (MSMEs) ఇది నిజంగా పండగలాంటి వార్త. భారత్–UAE మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం…
Nara Lokesh : దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
Post Office Recurring Deposit (RD) Scheme : షేర్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్న తరుణంలో,…
Husband and Wife : దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
This website uses cookies.