Miss Shetty Mr Polishetty trailer Interesting news about Anushka Shetty
Anushka Shetty : హీరోయిన్ అనుష్క ఓ గొప్ప నటి అనటంలో ఎటువంటి అతిశయక్తి లేదు. అందాల భామ గా ఎంట్రీ అభినయంతో ఆడియన్స్ మనసు గెలిచి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది ఈ కన్నడ సుందరి. బాహుబలి సక్సెస్ అనంతరం భాగమతి చిత్రంలో నటించిన అనుష్క… ఆ సినిమాను ఒంటి చేత్తో బంపర్ హిట్ చేసింది. అయితే ఆ తర్వాత అనుష్క ఏ చిత్రాన్ని ఒప్పుకోలేదు. దీంతో స్వీటీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ నటికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.నలభై ఏళ్ల వయసు దాటిన ఈ కన్నడ కస్తూరి పెళ్లిపై గత 5 సంవత్సరాలుగా వార్తలు వస్తున్నా… ఆమె ఇప్పటికీ పెళ్లిపై ఓ క్లారిటీ రాకపోవటం గమనార్హం. స్వీటీ తర్వాత వచ్చిన హీరోయిన్లకు సైతం పెళ్ళిళ్ళు అయిపోగా తాను మాత్రం ఇంకా సింగిల్ గానే ఉంది. అనుష్క..
Anushka marriage update news went viral in social media
టాలీవుడ్ కి చెందిన ఓ సీనియర్ హీరోతో ప్రేమలో ఉందని… కొంచం ఆలస్యం అయినా అతనితో తన పెళ్లి జరుగుతుందని వార్తలు ఎప్పటినుంచో వింటూనే వస్తున్నాం. కానీ అవి నేటికీ వార్తలు గానే మిగిలిపోయాయి. అయితే స్వీటీ పెళ్లి ఆలస్యం అవ్వడానికి ఆమె జాతకం లో ఉన్న ఏదో దోషమే కారణమని.. దానికి ఇటీవలే ఆమె కుటుంబ సభ్యులు దోష నివారణ చేశారంటూ ప్రస్తుతం కన్నడ మీడియా కోడై కూస్తోంది. ఏది ఏమైనప్పటికీ దోష నివారణ చేశారు కాబట్టి త్వరలోనే ఆమె పెళ్లిపై ఓ క్లారిటీ వస్తుందా అని ఇప్పుడు ఆమె అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.తాము కోరుకుంటున్నట్లుగానే అనుష్క పెళ్లి ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో ప్రభాస్ తోనే జరగాలని భావిస్తున్నారు.
ఈ ఏడాది ముగింపుకు ఇంకా రెండు వారాలే మిగిలి ఉండగా కనీసం నెక్స్ట్ ఇయర్ మొదలు అయ్యాకనైనా స్వీటీ తన పెళ్లి విషయంపై ఏమైనా అప్డేట్ ఇస్తుందో లేదో చూడాలి మరి.తెలుగులో సూపర్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క… అనతి కాలంలోనే అగ్ర హీరోల సరసన అవకాశాలు దక్కించుకుని టాప్ హీరోయిన్ అయిపోయింది. దశబ్దాల పాటు సౌత్ ఇండియాలో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతూ అద్భుతమైన చిత్రాల్లో నటించింది. అరుంధతి, రుద్రమ దేవి, బాహుబలి, భాగమతి వంటి పవర్ ఫుల్ చిత్రాల్లో నటించి తనేంటో రుజువు చేసింది. స్టార్ హీరోలతో సమానంగా స్టార్ డమ్ దక్కించుకున్న అనుష్క పెళ్లి కోసం ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.