Heroine Anushka shetty is suffering from a strange disease
Anushka : అందాల ముద్దుగుమ్మ అనుష్క సూపర్ సినిమాతో హీరోయిన్‌గా మారిన విషయం తెలిసిందే. ఆమె ఒకవైపు కథానాయికగా నటిస్తూనే లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో మెరసింది. అనుష్క ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో ఒకరు అనే విషయం మనందరికి తెలిసిందే. అయితే అనుష్క చాలా స్లో అండ్ కామ్. ఎలాంటి వివాదాల జోలికి పెద్దగా పోదు. అలానే వివాదాలపై కూడా స్పందించడానికి అంతగా ఆసక్తి చూపదు. అయితే తాజాగా కాస్టింగ్ కౌచ్ విషయంలో అనుష్క సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయి.
ప్రస్తుతం అనుష్క నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న ఓ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవకాశాలు ఆశచూపి అమ్మాయిలను లొంగదీసుకునే విష సంస్కృతి టాలీవుడ్ లో కూడా ఉంది. కెరీర్ బిగినింగ్ లో నేను కూడా చూశాను. అయితే నేను ప్రతి విషయంలో నిక్కచ్చిగా ఉంటాను. కరెక్ట్ గా మాట్లాడతాను, కాబట్టి ఈ ఇబ్బందులు నాకు ఎదురు కాలేదు. నా మనస్తత్వం తెలిసి, నా దగ్గరకు ఎవరూ ఇలాంటి ప్రతిపాదనలు తీసుకురాలేదు అని పేర్కొంది.అన్ని చోట్ల కాస్టింగ్ కౌచ్ ఉంటుంది.
anushka shetty comments on casting couch
కాకపోతే మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉందంటూ అనుష్క పలు కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అనుష్క చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఇటీవలి కాలంలో అనుష్క మాదిరిగానే చాలా మంది హీరోయిన్స్ కూడా తమ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలపై సంచలన కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో కెరీర్ సమస్యలు వస్తాయని మౌనంగా ఉన్న వారు ఇప్పుడు నిర్భయంగా ఆ నాటి విషయాల గురించి చెప్పుకొస్తున్నారు.అరుంధతి సినిమాతో అదుర్స్ అనిపించిన అనుష్క చివరిగా నిశ్శబ్ధం చిత్రంతో ప్రేక్షకులని పలకరించింది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.