Home » Entertainment » Ap Minister Roja Daughter Anshu With Tamil Star Hero Son Of Love
Entertainment

Roja Daughter Anshu : తమిళ స్టార్ హీరో కొడుకుతో ఏపీ మంత్రి రోజా కూతురు అన్షు రొమాన్స్?

Authored By
mallesh
The Telugu News | Published on: September 20, 2022, 8:00 pm
Advertisement

Roja Daughter Anshu : ఏపీ మంత్రి, మాజీ నటి రోజా కూతురు సినీ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. తన కూతురిని హీరోయిన్‌గా పరిచయం చేయాలని రోజా చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. సరైన సమయానికి అన్షు గ్రాండ్ ఎంట్రీ ఇస్తుందని ముందు నుంచే హింట్స్ ఇస్తూ వచ్చిన రోజా తాజాగా అందుకు సమయం ఆసన్నమైనదని వెల్లడించినట్టు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ముందుగా తమిళంలో తన కూతురు అన్షును లాంచ్ చేయాలని రోజా భావిస్తోందట.. సీనియర్ నటి రోజా ప్రస్తుతం పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉన్నారు.

Advertisement

వైసీపీ ప్రభుత్వంలో ఆమె మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే, తన కూతురు ప్రస్తుతం అమెరికాలో నటన పరంగా ట్రైనింగ్ తీసకుంటున్నట్టు తెలుస్తోంది. అన్షు మంచి విద్యార్థి మాత్రమే కాదు టాలెంటెడ్ యువతి అని అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అన్షు.. అప్పుడప్పుడు తన తల్లితో కలిసి దిగిన పిక్స్ షేర్ చేస్తుంటుంది. ఇక సినీ ఆరంగేట్రం విషయానికొస్తే రోజా కూడా తన కెరీర్ తమిళంలో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.తన భర్త కూడా సెల్వమణి కూడా తమిళనాడు చెందిన దర్శకుడు.

AP minister Roja daughter Anshu with Tamil star hero son of love

Advertisement

Roja Daughter Anshu : స్టారో హీరో కొడుకుతో అన్షు రొమాన్స్

రోజా తన సినీ కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడే సెల్వమణిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు.కూతురు అన్షుతో పాటు ఒక కొడుకు ఉన్నాడు. ఈ నేపథ్యంలో తన కూతురు అన్షును కూడా రోజా ముందు తమిళంలో పరిచయం చేశాక తెలుగులోకి తీసుకురావాలని భావిస్తుందట..అయితే, అన్షు తన తొలి సినిమా స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవతో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. విక్రమ్ తనయుడు ధృవ నటనా పరంగా తండ్రితో పోటీ పడుతున్నాడు. అర్జున్ రెడ్డి రీమేక్‌లో ధృవ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా, ధృవతో అన్షు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తుండగా..దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి