Home » Entertainment » Apsara Rani Comments On A Director
Entertainment

Apsara Rani : కోరిక తీరిస్తే ఛాన్స్ ఇస్తాన‌న్న డైరెక్ట‌ర్.. రామ్‌గోపాల్ వర్మ హీరోయిన్‌ అప్సర రాణికి చేదు అనుభ‌వం

Authored By
Sam C
The Telugu News | Updated on: January 17, 2022 4:36 pm
Advertisement

Apsara Rani : అప్సర రాణి.. ఈ ముద్దుగుమ్మ 2019లోనే ఇండస్ట్రీకి వచ్చినా పెద్ద‌గా పాపుల‌ర్ కాలేదు. ఎప్పుడైతే రామ్‌గోపాల్ వర్మ మూవీ థ్రిల్లర్ ద్వారా యూత్‌కు దగ్గరయిందో అప్ప‌టి నుండి వ‌రుస ఆఫ‌ర్స్ అందుకుంటూ అంద‌రి దృష్టి ఆక‌ర్షిస్తుంది. రవితేజ మూవీ క్రాక్‌లో ఐటమ్ సాంగ్ చేసి తన అందచందాలతో అదరగొట్టింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తన ఫోటోలతో కుర్రకారు టెంపరేచర్ పెంచుతోంది.ఈమె కెరీర్‌లో కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి. వాటినే అభిమానులతో పంచుకుంది అప్సర.

Advertisement

‘థ్రిల్లర్’ మూవీతో అప్సర రాణి అందాలను ప్రేక్షకుల ముందుంచారు రామ్ గోపాల్ వర్మ. ఆమె అసలు పేరు అంకిత మహరాణ కాగా అప్సర రాణిగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. అందరిలానే తనకు కూడా సినీ ఇండస్ట్రీ పరంగా చేదు అనుభవాలు ఉన్నాయంటూ రీసెంట్‌గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అప్సర చెప్పుకొచ్చింది. కెరీర్‌లో కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయని తెలిపింది. ఈమెకు కన్నడ ఇండస్ట్రీలో ఓ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసారని.. అయితే డిస్కషన్స్ కోసం మాత్రం రూమ్‌కు ఒంటరిగా రమ్మన్నారని తెలిపింది అప్సర.తన కోరిక తీరిస్తే అవకాశం ఇస్తానని ఓ ద‌ర్శ‌కుడు అన్నాడ‌ట‌.

Apsara rani comments on a director

Advertisement

Apsara Rani : కోరిక తీరిస్తే ఛాన్స్..

ఈ విష‌యం గుర్తు చేసుకుంది అప్స‌ర‌. అయితే తాను మాత్రం అక్కడికి తన నాన్నను తీసుకెళ్లానని.. కానీ అక్కడ పరిస్థితి అర్ధమైపోయి నాన్నతో కలిసి తాను కూడా పారిపోయి వచ్చానని చెప్పుకొచ్చింది అప్సర రాణి. తెలుగులో త‌న‌కు అలాంటి అనుభ‌వాలు ఎదురు కాలేదు అంటుంది. టాలెంట్ ఉన్న వాళ్లకు తెలుగులో మంచి అవకాశాలు లభిస్తాయని, ఒక సినిమా క్లిక్ అయితే చాలు తెలుగు ప్రేక్షకులు ఆదరణ బాగా లభిస్తుందని చెప్పింది. గోపీచంద్ ‘సీటీమార్’ సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేసి పెప్సీ ఆంటీగా ఊపేసిన అప్సర రాణి ఇప్పుడు మంచి అవ‌కాశాల కోసం ఎదురు చూస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి