Prabha Heroine : నువ్వు వర్జినేనా .. ప్రభాస్ హీరోయిన్ కు దారుణమైన ప్రశ్న ..!
Prabha Heroine : సోషల్ మీడియా వేదికగా సినీ నటులు, అభిమానులతో నిత్యం ఇంటరాక్షన్ జరుపుతూ ఉంటారు. ఈ క్రమంలో అభిమానులు తమ అభిమానితారల వ్యక్తిగత జీవితానికి మరింత చేరువ అయ్యేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. కొన్నిసార్లు అభిమానులు అడిగే కొన్ని ప్రశ్నలు చిరాకు పెట్టిస్తాయి. తాజాగా, ప్రముఖ నటి మాళవిక మోహనన్ ఇలాంటి ఒక అభ్యంతరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ట్విట్టర్‌లో లైవ్ చిట్‌చాట్ చేస్తుండగా ఓ నెటిజన్ ఆమెను “మీరు వర్జినేనా?” అంటూ అసభ్యంగా ప్రశ్నించాడు.
Prabha Heroine : నువ్వు వర్జినేనా .. ప్రభాస్ హీరోయిన్ కు దారుణమైన ప్రశ్న ..!
ఈ ప్రశ్నను చూసిన మాళవిక షాక్‌కు గురయ్యారు. వెంటనే స్పందించిన ఆమె ఇలాంటి చెత్త ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు? దయచేసి మారేయండి అంటూ గట్టిగానే కౌంటరిచ్చారు. ఆమె స్పందన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఆ అభ్యంతరమైన కామెంట్ చేసిన వ్యక్తిపై మండిపడుతున్నారు. ఇలాంటి ప్రశ్నలు అడగడం సిగ్గుచేటు అని, సెలబ్రెటీలు కూడా మన తల్లి, అక్క, చెల్లిలాంటి వారే కాబట్టి గౌరవించాలి అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
కెరీర్ పరంగా చూస్తే మాళవిక మోహనన్ ప్రస్తుతం పలు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. ప్రభాస్‌తో ‘ది రాజా సాబ్’, కార్తీతో ‘సర్దార్ 2’లో నటిస్తున్నారు. అలాగే గతంలో రజనీకాంత్, విజయ్, ధనుష్ వంటి స్టార్ హీరోలతో చేసిన సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయినప్పటికీ, సోషల్ మీడియా వేదికగా వస్తున్న ఇలాంటి అభ్యంతరకర ప్రశ్నలు నటీమణుల వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీయడమే కాక, సమాజంలో మహిళల పట్ల ఉన్న ఆలోచనా ధోరణిని ప్రశ్నించాల్సిన అవసరాన్ని బలంగా సూచిస్తున్నాయి.
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
Facial Fact | వయసు పెరిగేకొద్దీ ముఖంపై కొవ్వు పెరగడం సహజం. ఈ సమస్య కారణంగా చాలా మందికి డబుల్…
This website uses cookies.