Home » Entertainment » Ariyana Glory Is On Set For Second Movie
Entertainment

Ariyana Glory : కొత్త అవతారమెత్తిన బిగ్ బాస్ బ్యూటీ.. అరియానా వీడియో వైరల్

Authored By
Cinema Desk
The Telugu News | Published on: August 11, 2021, 6:30 pm
Advertisement

Ariyana Glory : బిగ్ బాస్ బ్యూటీ అరియానా సోషల్ మీడియాలో చేసే అల్లరి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆర్జీవీ చేసిన తొడల కామెంట్‌తో అరియానా వెలుగులోకి వచ్చింది. అలా బిగ్ బాస్ షోలో ఆఫర్ వచ్చింది. అక్కడి నుంచి అరియానా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. తన అతితో కొంత మందిని విసిగించినా కూడా బిగ్ బాస్ ఇంట్లో తన తెగువ, ధైర్యసాహసాలతో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. అలాంటి అరియానా ఇప్పుడు సినిమా ఆఫర్లతో బిజీగా ఉంది.

Advertisement

Ariyana Glory Is On Set For Second Movie

ఎక్కడో యూట్యూబ్‌లో ఇంటర్వ్యూలు చేసుకుంటూ ఉన్న అరియానా, బుల్లితెరపై స్టార్‌గా ఎదిగింది. వెండితెరపై ఇప్పుడు ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఆల్రెడీ రాజ్ తరుణ్ హీరోగా వస్తోన్న సినిమాలో హీరోయిన్‌‌గా నటించింది. ఇక ఇప్పుడు తన రెండో ప్రాజెక్ట్‌ను కూడా లైన్‌లో పెట్టేసింది. అలాంటి అరియానా సెట్‌లో ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తోంది. ఎవ్వరికైనా సరే ఒక్కసారైనా మెగా ఫోన్ పట్టుకోవాలనే ఆశ ఉంటుంది. అరియానాకు కూడా ఆ ఆశే ఉన్నట్టుంది.

Advertisement

Ariyana Glory : కొత్త అవతారమెత్తిన బిగ్ బాస్ బ్యూటీ.. అరియానా వీడియో వైరల్

అరియానా మెగా ఫోన్ పట్టుకుని యాక్షన్ చెప్పాలని అనుకున్నట్టుంది. అందుకే తన డైరెక్టర్ దగ్గరకు వచ్చి.. మైకు తీసుకుని.. ఓ సీన్‌కు యాక్షన్ చెప్పి తన కోరికను తీర్చుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. తన రెండో ప్రాజెక్ట్ అంటూ.. ఇందులో భాగస్వామిని కావడం ఎంతో ఆనందంగా ఉందని అరియానా చెప్పుకొచ్చింది. ఇక బుల్లితెరపై అప్పుడప్పుడు స్పెషల్ ఈవెంట్లలో అరియానా కనిపిస్తూ మెప్పిస్తుంటుంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి