Ariyana Glory : సెలబ్రిటీ స్టేటస్ పొందిన అరియానా అర్ధరాత్రి దొంగతనం.. ఇలా మారిందేంటి..?
Ariyana Glory : రామ్ గోపాల్ వర్మ బ్యూటీగా పేరొందిన అందాల భామ అరియానా. వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.ఇటీవల హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది ఈ సొగసరి. నెట్టింట్లో ఎంతో యాక్టీవ్ గా ఉంటూ.. తన వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను, అలానే తన గ్లామర్ ఫొటోలని తెగ షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. అరియానాకి బిగ్ బాస్ మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ షో తర్వాత అరియానా పేరు తెగ వార్తలలో నిలుస్తుంది. ఎప్పుడు ఏం చేసిన కూడా అరియానా హైలైట్ అవుతుంది. తాజాగా ఈ అమ్మడు చేసిన దొంగతనం అందరి దృష్టిని ఆకర్షించింది. కొందరైతే అరియానాని తిట్టరాని తిట్లు తిడుతున్నారు.
బిగ్ బాస్ కంటెస్టెంట్ జెస్సి తో పాటు ఓ ఫంక్షన్‌కి కారులో వెళుతుంది. అయితే నగర శివారులో పాల కూర తోట కనిపించడంతో ఆమె ఆగలేక రాత్రి సమయంలో ఎవరు చూడకుండా పాల కూర దొంగతనం చేసింది. పది రూపాయలు పెడితే బయట దొరుకుతాయి కదా. ఇవి ఎందుకు అలా దొంగతనం చేస్తున్నావు అంటే, ఇవి ఫ్రెష్‌వి కదా అంటూ ఏవో కవర్ చేసింది. అయితే అరియానా వీడియో ఇప్పుడు వైరల్ అవుతుండగా, దానిపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాపం రైతు కష్టపడి పండించుకుంటే ఇలా దొంగతనం చేయడానికి సిగ్గులేదా అంటూ కొందరు మండిపడుతున్నారు. ఇక అరియానా తరచుగా బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తుంది. కొంచెం ఒళ్ళు చేసిన అరియనా మరింత హాట్ గా తయారైంది. అయితే కొందరు ఆమెను లావు అయ్యావని విమరిస్తుండగా, వారికి తనదైన శైలిలో అరియనా కౌంటర్ ఇచ్చింది.
Ariyana Glory : సెలబ్రిటీ స్టేటస్ పొందిన అరియానా అర్ధరాత్రి దొంగతనం.. ఇలా మారిందేంటి..?
ఇక అరియానా బిగ్ బాస్ లో పాల్గొన్నప్పుడు ఆమె తన ముక్కుసూటితనంతో మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 4 ఫైనలిస్ట్స్ లో అరియనా ఒకరిగా నిలిచింది. ఆ సీజన్‌లో అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అరియనాకు 4వ స్థానం దక్కింది. బిగ్ బాస్ అనంతరం ఆమెకు బుల్లితెర మీద వరుస ఆఫర్స్ వెల్లువెత్తాయి. బీబీ జోడీలో సందడి చేసింది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ తో డాన్స్ రియాలిటీ షో జరగగా అందులోను సత్తా చాటింది. అవినాష్ తో జతకట్టిన అరియనా ఫైనల్ కి వెళ్లింది కాని ట్రోఫీ దక్కించుకోలేకపోయింది. బీబీ జోడి ఫైనల్ లో ఫైమా-ఆర్జే సూర్య జోడీ చేతిలో ఓడిపోగా వారు రూ25 లక్షలు దక్కించుకునే ఛాన్స్ కోల్పోయారు.
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
This website uses cookies.