Home » Entertainment » Ashu Reddy Gets Trolls On Samantha Divorce Issue
Entertainment

Ashu Reddy : నువ్ కూడా సమంతలానే భర్తతో విడిపోతావా?.. నెటిజన్ ప్రశ్నకు అషూ రెడ్డి షాకింగ్ కామెంట్స్

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: October 12, 2021, 12:24 pm
Advertisement

Ashu Reddy : ఇప్పుడు జనాల్లో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న అంశం చై-సామ్ డివోర్స్. ఎంతో క్యూట్ కపుల్ అని పేరు తెచ్చుకున్న ఈ జోడీ ఎందుకు విడాకుల దాకా పోయారనే దానిపై ఓ రేంజ్ చర్చలు నడుస్తున్నాయి. వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత అభిప్రాయ బేధాలు తలెత్తాయని కొందరు, లేదు లేదు అక్కినేని ఫ్యామిలీ కండీషన్స్ సమంతకు నచ్చలేదని ఇంకొందరు ఇలా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా సమంత క్యారెక్టర్‌పై భారీ విమర్శలు వస్తుండటం చూస్తూనే ఉన్నాం.

Advertisement

Ashu Reddy Gets Trolls On Samantha Divorce Issue

దీనిపై సమంత కూడా పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ సమాజంలో మెగా వాడు చేస్తే ఒకలా, అదే ఆడది చేస్తే మరోలా చూడటమే గాక ఆడవాళ్లనే నిందిస్తుంటారంటూ సంచలన కామెంట్స్ చేసింది. అయినప్పటికీ సమంతపై నడుస్తున్న ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. తాజాగా సమంతపై నెగిటివ్ కామెంట్స్ చేసిన ఓనెటిజన్‌కి గట్టి కౌంటర్ ఇచ్చింది జూనియర్ సమంత పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి.

Advertisement

Ashu Reddy : దుమ్ముదులిపిన అషూ రెడ్డి

Ashu Reddy Gives Clarity On express hari Tattoo

అషూ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఓ పోస్ట్‌పై నెటిజన్ రియాక్ట్ అవుతూ.. మీరు సమంతలాగే ఉన్నారు.. మరి పెళ్లి విషయంలో మాత్రం సమంతలా చేయొద్దు అని కామెంట్ చేశాడు. దీంతో అతనికి వెంటనే గడ్డి పెడుతూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది అషు. ‘కథలో మరో కోణం గురించి తెలుసుకోకుండా ఎదుటివారి గురించి, వారి జీవితాల గురించి మాట్లాడొద్దు’ అంటూ గట్టిగానే ఇచ్చుకుంది. అలా సమంతకు తన మద్దతు తెలిపింది అషు రెడ్డి.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి