Home » Entertainment » Ashu Reddy Participates For Bigg Boss Ott
Entertainment

Ashu Reddy : బిగ్ బాస్ ఓటీటీలో అషూ రెడ్డి.. ఇన్‌డైరెక్ట్ హింట్ ఇచ్చిన రాహుల్​ సిప్లిగంజ్

Authored By
Sam C
The Telugu News | Published on: February 22, 2022, 4:00 pm
Advertisement

Ashu Reddy : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మాంచి ఎంట‌ర్‌టైన్‌మైంట్ అందిస్తున్న షో బిగ్ బాస్. ఫిబ్రవరి 26 నుండి బిగ్ బాస్ ఓటీటీ మొదలు కాబోతుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక, అగ్రిమెంట్స్ కూడా పూర్తవగా.. వారికి క్వారంటైన్ కూడా విధించినట్లు చెప్పుకుంటున్నారు. హిందీలో మాదిరిగా త‌మిళం, తెలుగులో ఓటీటీని మొద‌లు పెట్ట‌బోతున్నారు. ఓటీటీ తొలి సీజన్ కు హైప్ తెచ్చేందుకు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లను రంగంలోకి దింపనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. పాత కొత్త కంటెస్టెంట్ల కలయికలో ఈ ఓటీటీ తొలి సీజన్ బిగ్ బాస్ షో ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా సమాచారం.

Advertisement

‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ పేరుతో ‘డిస్నీ ప్లస్​ హాట్‌స్టార్‌’లో ప్రసారం కానున్న ఈ షోకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.నో కామా, నో పులిస్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్​టైన్​మెంట్ అంటూ ప్రోమోను కూడా రిలీజ్‌ చేశారు. తెలుగులో మొదటిసారిగా 24 గంటలు పాటు ప్రసారం కానున్న ఈ షోలో కంటెస్టెంట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. తాజాగా ఒక మాజీ బిగ్​బాస్​ కంటెస్టెంట్​ ఈ ఓటీటీ షోలో కన్ఫర్మ్​ అయినట్లు తెలుస్తోంది. బోల్డ్​ బ్యూటీ అషు రెడ్డీ బిగ్​బాస్​ నాన్​స్టాప్​లో సందడి చేయనున్నట్లు బిగ్​బాస్​ మూడో సీజన్ విన్నర్​ రాహుల్​ సిప్లిగంజ్​ పరోక్షంగా హింట్​ ఇచ్చాడు. ‘ఆల్​ ది బెస్ట్​ అషు.. దేనికి చెప్పానో నువే ఆలోచించుకో’ అంటూ పోస్ట్​ చేశాడు రాహుల్.

ashu reddy participates for bigg boss ott

Advertisement

Ashu Reddy : అషూ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుందా..

దీంతో అందరూ అషు రెడ్డి బిగ్​బాస్​ నాన్​స్టాప్​లో ఎంట్రీ ఇస్తుందని చర్చించుకుంటున్నారు.’బంపర్ ఆఫర్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ బిందు మాధవి కూడా ఓటీటీలో పాల్గొన‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. బంప‌ర్ ఆఫ‌ర్ ఈ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఈ బ్యూటీ .. ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు అవకాశాలు తగ్గడంతో…కోలీవుడ్ వైపు మళ్లింది. అక్కడ నటిగా గుర్తింపు తెచ్చుకున్న బిందు.. ఈ సారి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలవాలని గట్టిగా నిర్ణయించుకుంది. అందుకే తెలుగు బిగ్ బాస్ ఓటీటీ ద్వారా మళ్లీ కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమైంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి