Home » Entertainment » Ashu Reddy Shopping At Dubai
Entertainment

Ashu Reddy : అషూ రేంజ్ బాగానే పెరిగింది.. హ్యాండ్ బాగ్ ఖరీదు మరీ అంతనా?

Authored By
aruna
The Telugu News | Published on: November 7, 2021, 12:40 pm
Advertisement

Ashu Reddy : బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి ప్రస్తుతం దుబాయ్‌లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అలా వెకేషన్‌కు వెళ్లిన అషూ రెడ్డి అక్కడ దుమ్ములేపుతోంది. తన రేంజ్ ఏంటో ఒకే ఒక్క ఫోటోతో చూపించింది. అసలే ఇప్పుడు పలు విధాలుగా డబ్బులు సంపాదించేస్తోంది. సోషల్ మీడియా, బుల్లితెరపై అషూ రెడ్డి బిజీగా ఉంటూ.. బాగానే సంపాదిస్తోంది. యూట్యూబ్ వీడియోలతోనూ అషూ రెడ్డి బాగానే వెనకేసుకుంటున్నట్టు కనిపిస్తోంది.

Advertisement

Ashu Reddy Shopping At Dubai

అయితే గతంలో ఓ సారి అషూ రెడ్డి తన అమ్మ మీద ఫ్రాంక్ చేసింది. లక్ష రూపాయలు పెట్టి ఓ హ్యాండ్ బ్యాగ్ కొన్నట్టు బిల్డప్ ఇచ్చింది. అదే విషయాన్ని తన అమ్మ వద్ద చెప్పింది. లక్ష రూపాయల హ్యాండ్ బ్యాగ్ చెప్పడంతోనే విసిరి కొట్టేసింది. అషూ మీద అంత ఎత్తున లేచింది. ఇప్పటికే ఇంట్లో ఉన్నవి చాలవా? ఇంత రేటు పెట్టి కొనాలా? అంటూ చీవాట్లు పెట్టేసింది. ఊరికే చెప్పానే.. అది నేను కొనలేదు.. వేరే ఫ్రెండ్ ఇచ్చాడంటూ చెప్పేసింది.

Advertisement

Ashu Reddy : అషూ రెడ్డి హ్యాండ్ బ్యాగ్ ఖరీదు..

Ashu Reddy Shopping At Dubai

లక్ష రూపాయలు పెట్టి కొన్నాను అని అబద్దం చెబితేనే అంత ఎత్తున లేచింది. ఇక ఇప్పుడు దుబాయ్‌లో షాపింగ్ చేస్తూ అంతకు మించి అనేలా ఉన్న హ్యాండ్ బ్యాగ్ కొనేసిందట. దాని రేటు లక్ష 60 వేలు అని చెప్పింది. కొనాలా? వద్దా? తన ఫాలోవర్లను అడిగింది. కానీ చివరకు కొనేశాను అని చెప్పింది. అలా మొత్తానికి లక్షన్నరకు పైగా ఉన్న హ్యాండ్ బ్యాగ్ కొనేసి తన సత్తా ఏంటో చూపించింది. అసలే కామెడీ స్టార్స్, హ్యాపీ డేస్ అంటూ షోలతో బిజీగా గడిపేస్తోంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి