
Venu Swamy : ప్రభాస్ జాతకానికి శ్యామలాదేవికి సంబంధం లేదు... క్లారిటీ ఇచ్చిన వేణు స్వామి...!
Venu Swamy : తెలుగు సినీ ఇండస్ట్రీలో వేణు స్వామి అంటే తెలియని వారు ఉండరు కాబోలు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈయన పేరు విపరీతంగా వినిపిస్తోంది. రాజకీయ నాయకుల జాతకాలను మరియు సినీ సెలెబ్రెటీల జాతకాలను బయటపెడుతూ సంచలనంగా మారిన వేణు స్వామి అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. అయితే ఈ విధంగా బాగా పాపులారిటీ సంపాదించుకున్న వేణు స్వామి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు కూడా గురవుతున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని ఇంటర్వ్యూలలో ఆయన చెప్పే మాటలు దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో ప్రభాస్ జాతకాన్ని తన పెద్దమ్మ శ్యామలాదేవి వేణు స్వామికి చూపించినట్టుగా వార్తలు ప్రచారం జరిగాయి. ఈ క్రమంలోనే శ్యామలాదేవి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ వేణు స్వామి ఎవరో నాకు తెలియదు అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా వేణు స్వామి పేరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురైంది. ఇక ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు.
ఈ క్రమంలోనే యాంకర్ మాట్లాడుతూ.. ప్రభాస్ గారి పెద్దమ్మ మీ వద్దకు వచ్చారా అని అడగగా… దానికి వేణు స్వామి సమాధానం ఇస్తూ…ప్రభాస్ గారి పెద్దమ్మకి ప్రభాస్ గారికి సంబంధం లేదు. చాలామంది ఇక్కడ రిలేషన్ అంటారు , వారి వ్యక్తిగత విషయాలకు నేను వెళ్ళను కానీ జాతకాల ప్రకారం ఇక్కడ ప్రభాస్ గారికి ఆయన పెద్దమ్మకి ఎలాంటి సంబంధం ఉండదు. నాకు సంబంధించి ప్రభాస్ గారి అమ్మగారికి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. అయితే వాస్తవానికి ప్రభాస్ జాతకం నా దగ్గరకు వేరే వారి ద్వారా రావడం జరిగింది. వారు ఎవరు అనేది నేను చెప్పను కానీ ప్రభాస్ గారి జాతకానికి కృష్ణంరాజు గారి భార్యకు ఎలాంటి సంబంధం లేదని వేణు స్వామి క్లారిటీ ఇచ్చారు. కానీ కృష్ణంరాజు గారి జాతకం కోసం ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి వేణు స్వామిని సంప్రదించినట్లుగా తెలియజేశారు. కానీ ఆమె ప్రభాస్ గురించి నా దగ్గర ప్రస్తావించలేదని ఈ సందర్భంగా వేణు స్వామి చెప్పారు.
Venu Swamy : ప్రభాస్ జాతకానికి శ్యామలాదేవికి సంబంధం లేదు… క్లారిటీ ఇచ్చిన వేణు స్వామి…!
కానీ ఇక్కడ శ్యామలాదేవి అసలు వేణు స్వామి అంటే ఎవరో తెలియదు అన్నట్టు మాట్లాడటం నాకు కాస్త బాధేసింది అంటూ వేణు స్వామి చెప్పుకొచ్చారు. అయితే చాలామంది నా దగ్గరకు వచ్చి రాలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి అష్ట కష్టాలు పడతారని తెలియజేశారు. కొన్ని సందర్భాలలో ఎవరైనా అడిగితే మాత్రమే వారి గురించి నేను చెబుతాను అంటూ సమాధానమిచ్చారు. అయితే ఇక్కడ వారి ప్రైవేసి గురించి నేను ఆలోచించాలి అంటే వారికి ఉచితంగా జాతకం చెప్పేందుకు నాకేంటి లాభం అంటూ వేణు స్వామి తెలిపారు. నేను చాలామంది సెలబ్రిటీలకు ఉచితంగానే జాతకాలు చెబుతాను పూజలు చేస్తాను. ఎందుకంటే నా పరపతి పెంచుకోవడానికి నా పేరు అందరికీ తెలిసేలా చేసుకోవడానికి. అలాంటప్పుడు వారి పేర్లను బయట పెట్టడంలో తప్పేముంది అంటూ వేణు స్వామి ఈ సందర్భంగా తెలియజేశారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.