Dhoni : మహేంద్రసింగ్ ధోని.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. క్రికెట్ చరిత్రలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ప్రత్యేక పేజీ లిఖించి ఉంటుంది. భారత క్రికెట్‌ను అత్యున్నత స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దిన ధోని .. కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా టీమిండియాకు ఎనలేని సేవలు అందించాడు. భారత్‌కు వన్డే, టీ-20 వరల్డ్‌కప్‌లను అందించి దిగ్గజ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పి ఏళ్లు గడుస్తున్నా, అతడి పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు. టీవీ యాడ్స్, ఎండార్స్‌మెంట్స్ ఆదాయంలో అతడు ప్రస్తుత క్రికెటర్ల కన్నా చాలా ముందు ఉన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో సంపన్న ఆటగాళ్ల జాబితాలో ధోని ముందు వరుసలో ఉన్నాడు. ప్రస్తుతం ధోని బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఐపీఎల్ ఆడుతున్నాడు.
గత సీజన్‌లో తన జట్టుని విజేతగా నిలిపిన ధోని ఈ సారి కూడా చెన్నై జట్టుకి కప్ అందించేలా చేసి ఐపీఎల్‌కి కూడా వీడ్కోలు పలుకుతాడని అంటున్నారు.ఈ క్రమంలో ధోని ఆడే ప్రతి మ్యాచ్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆయన బ్యాటింగ్‌కి వచ్చిన, కీపింగ్ చేసే సమయంలో అయిన ప్రేక్షకులు అరుపులతో స్టేడియం దద్దరిల్లేలా చేశారు. రోజు రోజుకి ధోనికి అభిమానులు పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు. తాజాగా ఓ వీరాభిమాని ధోని కోసం చేసిన పని చర్చనీయాంశం అవుతుంది. దిగ్గజ క్రికెటర్ ధోనీ ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు ఓ వీరాభిమాని తన పిల్లల స్కూల్ ఫీజును వాడాడు. అది కూడా బ్లాక్‌లో ఏకంగా 64,000 పెట్టి టికెట్లు కొని మరీ మ్యాచ్ చూశాడు.
కోల్‌కతా-చెన్నై మ్యాచ్ కోసం సదరు ఫ్యాన్ బ్లాక్‌లో టిక్కెట్ 64 వేల రూపాయలు పెట్టి కొని అందరిని ఆశ్చర్యపరిచాడు. తన పిల్లల కోసం దాచిన డబ్బుతో ఆయన చేసిన పనిని కొందరు సమర్ధిస్తుండగా, మరి కొందరు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన అతను టికెట్ల కోసం ఇలా స్కూల్ ఫీజు వాడినట్టు చెప్పడంతో ఇది వైరల్‌గా మారింది. అయితే ధోనీ ఆటను స్టేడియంలో లైవ్ చూసేందుకు తాను ఇలా చేశానని తెలుసుకున్న తన ముగ్గురు పిల్లలు చాలా సంతోషించారని కూడా పేర్కొన్నాడు. పిల్లల భవిష్యత్ పక్కన పెట్టి మ్యాచ్ కోసం ఇలా చేయడం పెద్ద పిచ్చి పని అని పలువురు కామెంట్ చేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.