astrology comments on Nayanthara marriage
Nayanthara : టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత ఎంతో ప్రాణంగా నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాని నాలుగేళ్లకే విడాకులు ఇచ్చింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి నయనతారకి కూడా పడుతుందంటున్నాడు వేణు స్వామి. సంచలన వ్యాఖ్యలతో, వివాదాలతో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నిత్యం వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. నాగ చైతన్య, సమంత విడిపోతారని కూడా వేణు స్వామి గతంలో తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ కు కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బందులు తప్పవని కూడా వేణు స్వామి తెలిపారు.
తాజాగా వేణు స్వామి స్వీటీ అనుష్క శెట్టి, రష్మిక వివాహాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తుండడంతో ఈ జాతకాల గొడవ మళ్ళీ మొదలైంది.నయనతార-విఘ్నేశ్ శివన్‌ల పెళ్లి గత కొంతకాలంగా చర్చనీయాంశం అవుతుంది. 5ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్న ఈ జంట పెళ్లి ఇవాళ, రేపు అన్నట్టుగా మారింది. ఈ ఏడాది జూన్ 9న తిరుమల తిరుపతి దేవస్థానంలో నయన్-శివన్‌లు పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో నయనతార వైవాహిక జీవితంపై అస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
astrology comments on Nayanthara marriage
నయన తారకు పెళ్లి అచ్చిరాదని, వివాహ అనంతరం తన వైవాహిక జీవితం సవ్యంగా సాగదని ఆయన అంటున్నారు.తన జాతకంలో గురుడు నీచ స్థితిలో ఉన్నాడని, అందువల్ల వైవాహిక జీవితంలో కలతలు, విభేదాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అంతేకాదు విడాకులు కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. అలాగే స్టార్ హీరోయిన్స్ అనుష్క శెట్టి, రష్మిక మందన్నాల గురించి కూడా చెప్పారు. వీరికి సైతం పెళ్లి జీవితం అచ్చి రాదని, వీరి జాతకంలో కూడా గురువు నీచ స్థితిలో ఉన్నట్లు తెలిపారు. ఇక చివరగా సమంత, పూజ హెగ్డే, రష్మిక మందన్నా, నయనతార సినీ కేరీర్ 2024 తర్వాత అంతమైపోతుందని ఆయన పేర్కొన్నారు.
కూకట్ పల్లి (Kukatpally) బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
This website uses cookies.