JR NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్‌ఆర్ సినిమా తో నటుడిగా మంచి మార్కులు దక్కించుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా లో రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ అద్బుతంగా నటించాడనే వార్తలు వచ్చాయి. ఇజ్రాయిల్ దేశం లో అత్యంత ప్రముఖమైన మీడియా పత్రిక కూడా ఆర్ ఆర్ ఆర్ లోని ఎన్టీఆర్ పాత్రను అద్భతం అన్నట్లుగా ప్రశంసించింది. అలాంటి ఎన్టీఆర్ పాత్రను ఆర్ ఆర్ ఆర్ లో చరణ్ పాత్ర తో పోల్చితే కాస్త ప్రాముఖ్యత తగ్గించే ప్రయత్నాలు జరిగాయి అనేది నందమూరి వర్సెస్ మెగా ఫ్యాన్స్ మద్య చర్చ.
ఎన్టీఆర్ కు కుటుంబం యొక్క మద్దతు లేకపోవడంతో పాటు ఇండస్ట్రీలో ఆయన వెనుక పెద్ద తల లేకపోవడం వల్లే ఆర్ ఆర్ ఆర్ లో ఆయనకు అన్యాయం జరిగింది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. మరో హీరో తండ్రి చక్రం తిప్పాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకా కూడా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ను తొక్కేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే ఔను అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. బయటి నుండి మాత్రమే కాకుండా సొంత కుటుంబం నుండి కూడా కొందరు ఎన్టీఆర్ ను తొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా ఏదీ చేయడం లేదు.
కారణం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందాల్సిన సినిమా ఆలస్యం అయ్యింది. స్క్రిప్ట్ వర్క్ విషయంలో కొరటాల శివ ను కొందరు ప్రభావితం చేస్తున్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందుకే ఎన్టీఆర్ సినిమా ఆలస్యం అవుతుంది అనేది వారి యొక్క వాదన. ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. కాని కచ్చితంగా ఎన్టీఆర్ ను ఇంకా కూడా కొందరు తొక్కేసేందుకు ప్రయత్నాలు బలంగా చేస్తున్నారి కొందరు భావిస్తున్నారు. నిజంగానే ఎన్టీఆర్ ను తొక్కేసేలా ప్లాన్ చేస్తే మాత్రం అది ఎన్టీఆర్ కు మరింతగా కలిసి వస్తుందని.. ఆర్ ఆర్ ఆర్ విజయం ఫలితం పునరావృతం అవుతుంది అనేది ఎన్టీఆర్ అభిమానుల యొక్క అభిప్రాయం.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.