Auto Ram Prasad also exit from jabardasth and sridevi drama company shows
Auto Ram Prasad : జబర్దస్త్ నుండి ఒక్కరొక్కరు చొప్పున సీనియర్స్ అంతా వెళ్ళి పోతున్నారు. ఇప్పటికే చాలా మంది జబర్దస్త్ ని వీడి వెళ్లడంతో జూనియర్స్ షో ను నెట్టుకొస్తున్నారు. హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పేసినట్లే కనిపిస్తుంది. ఇదే సమయంలో ఆటో రాంప్రసాద్ కూడా జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ బుల్లి తెర వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. రాంప్రసాద్ కి ఆప్త మిత్రుడు అయినా ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. నాగార్జున హీరోగా ఆయన సినిమా ను చేయబోతున్నట్లుగా
వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా ఆయనకు పలు ఆఫర్స్ వస్తున్నాయట. అందుకే మిత్రుడు దారిలోనే తాను కూడా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని రాంప్రసాద్ భావిస్తున్నాడు. ప్రసన్నకుమార్ మరియు రాంప్రసాద్ ఇద్దరూ కూడా గతంలో రచయితలుగా జబర్దస్త్ కి పని చేశారు. ప్రసన్న కుమార్ ఇప్పుడు సినిమాలకు రచయితగా వ్యవహరిస్తూ ఉండగా రాంప్రసాద్ మాత్రం ఇప్పటికీ జబర్దస్త్ లోనే కంటిన్యూ అవుతున్నాడు. అయితే వెండి తెరపై మెరవాలనే ఉద్దేశంతో రాంప్రసాద్ జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పే రోజు కోసం వెయిట్ చేస్తున్నాడట.
Auto Ram Prasad also exit from jabardasth and sridevi drama company shows
కేవలం జబర్దస్త్ కి మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా రాంప్రసాద్ గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయి అంటూ మల్లెమాల వారి ద్వారా సమాచారం అందుతుంది. అతి త్వరలోనే రాంప్రసాద్ సినిమా ఇండస్ట్రీలో బిజీ రచయిత అయ్యే అవకాశాలు ఉన్నాయి. నటుడిగా కూడా రాంప్రసాద్ కి సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయి, కానీ ఆయన రచయితగా మారి దర్శకుడిగా సెటిల్ అవ్వాలని చూస్తున్నాడట. అతి త్వరలోనే జబర్దస్త్ ని వీడి వెండి తెరపై రాంప్రసాద్ సందడి చేసే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.