Home » Entertainment » Avinash Fires On Vishnu Priya
Entertainment

vishnu priya : విష్ణుప్రియపై అవినాష్ ఫైర్.. అసలు అది ఎవరంటూ కామెంట్..

Authored By
mallesh
The Telugu News | Published on: March 3, 2022, 6:00 pm
Advertisement

vishnu priya : ముక్కు అవినాష్.. ఈ పేరు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితం. ఆయన టీవీ ప్రోగ్రామ్స్‌లో చేసే సందడి మామూలుగా ఉండదు. ఒకప్పుడు జబర్దస్త్ షో లో బాగా ఎంటర్ టైన్ చేశాడు. తర్వాత ఎన్నో అడ్డంకులను దాటుకుని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మల్లెమాల అగ్రిమెంట్లను కాదని, రూ.పది లక్షలు చెల్లించి మరీ బిగ్‌బాస్ హౌస్ కి వచ్చాడు. ఈ షో ద్వారా అవినాష్ కు దాదాపుగా రూ.50 లక్షల వచ్చినట్టు టాక్. ఫలితంగా అతని అప్పులు తీరిపోయాయట.

Advertisement

ప్రస్తుతం ఆయననే మెయిన్ రోల్ గా పెట్టి కామెడీ స్టార్స్ తీసుకున్నారు. ఇది పర్వాలేదని అనిపిస్తోంది. కానీ ఇప్పుడు కామెడీ స్టార్స్ ధమాకా అంటూ కొన్ని చేంజ‌స్ చేశారు. ఇందులో యాంకర్ వర్షిణిని తొలగించి శ్రీముఖిని పెట్టారు. తర్వాత ఆమెను సైతం తీసేసి దీపికను తీసుకొచ్చారు. జడ్జీలుగా నాగబాబును పెట్టారు.కొద్ది రోజుల పాటు అవినాష్ ఆ షోలో కనిపించలేదు. దీంతో అందరిలోనూ అతడు బటయకు వెళ్లిపోయాడా? అనే అనుమానాలు తలెత్తాయి. కొంత గ్యాప్ తర్వాత ఆయన మళ్లీ స్టేజ్ పైకి వచ్చాడు. షోకు దూరంగా ఉన్నందుకు గల కారణాలను చెప్పుకొచ్చాడు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో అవినాష్ తన ఫ్రస్ట్రేషన్‌ను బయటపెట్టాడు.

avinash fires on vishnu priya

Advertisement

vishnu priya : అది ఎవతిరా అంటూ ఊగిపోయాడు..

విష్ణుప్రియ తన పెళ్లిలో తీసిన వ్లాగ్ మీద ప్రస్తుతం ఆయన సీరియస్ అవుతున్నాడు. నా పెళ్లిలో వ్లాగ్ చేసేందుకు అది ఎవతిరా? అంటూ ఊగిపోతున్నాడు. నాకూ ఓ యూట్యూబ్ చానెల్ ఉంది.. నేను వీడియో తీసుకుని వ్లాగ్ చేసుకుందామని అనుకున్నా.. కానీ పొద్దున్నే ఏడు గంటలకు వచ్చి అంతా వీడియో తీసి వ్లాగ్ చేసింది. నాకు వ్యూస్ రాలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మరి ఇదంతా నిజమేనా? లేక స్కిట్ లో భాగమా? అనేది తెలియాలి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి