Balakrishna And pawan kalyan meeting topic now
Balakrishna- Pawan Kalyan : ఒకరు మాస్‌కి కేరాఫ్ అడ్రెస్, మరొకరు అశేష జనసంద్రం ఉన్న స్టార్ హీరో.. వీరిద్దరు ఒకే ఫ్రేములో కనిపిస్తే అభిమానుల ఆనందం ఏం రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఇంతకు ఆ హీరోలు ఎవరనే కదా మీ డౌట్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి నటసింహం బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణని ‘వీరసింహా రెడ్డి’ మూవీ సెట్స్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలవడం చర్చనీయాంశంగా మారింది. సినిమా ఇండస్ట్రీతో పాటు అటు పొలిటికల్ సర్కిల్‌లోనూ వీరి కలయికపై ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. శుక్రవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో బాలకృష్ణను పవన్ కల్యాణ్ ఇతర నటీ నటుల కలవగా,
ఆ తర్వాత ఏకాంతంగా 20 నిమిషాల పాటు చర్చలు జరిపారని తెలుస్తుంది.ఆ చర్చలు దేని గురించి అని అందరిలో ఆసక్తి నెలకొంది. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇద్దరూ సినిమాలతో పాటు ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగావ్యవహరిస్తున్నారు. బాలయ్య టీడీపీ ఎమ్మెల్యే కాగా పవన్ కళ్యాణ్ జనసేన అధినేత అన్న విషయం తెలిసిందే.. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండగా రాజకీయం రోజురోజు వేడెక్కిపోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. బాలయ్యని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే ప్రసక్తే లేదని చెబుతూ వస్తుండగా, ఆయన టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళతారనే ప్రచారం జరుగుతుంది.
Balakrishna And pawan kalyan meeting topic now
ఈ రాజకీయ పరిణామాల మధ్య బాలయ్య-పవన్ కళ్యాణ్ భేటీ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది 20 నిమిషాల పాటు జరిగిన చర్చలలో ఏయే అంశాలు చర్చకు వచ్చాయని ప్రతి ఒక్కరు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ త్వరలో బాలయ్య అన్ స్టాపబుల్ షోలో పాల్గొననున్నారు. పవన్ తో పాటు త్రివిక్రమ్ కూడా షోలో పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ డిసెంబరు 27న జరగనుందని తెలుస్తుంది. అయితే అంతకంటే ముందే… పవన్ బాలకృష్ణ కలవడం హాట్ టాపిక్ అయింది.
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
This website uses cookies.