Home » Entertainment » Balakrishna Fans Say Manasu Venna
Entertainment

BalaKrishna : చెంప చెళ్లుమ‌నిపించినా మా బాల‌య్య మ‌న‌సు వెన్న అంటున్న ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?

Authored By
Sam C
The Telugu News | Published on: July 26, 2022, 4:30 pm
Advertisement

BalaKrishna : బాల‌కృష్ణ‌ని చూస్తే ఒక్కోసారి తోటి న‌టీన‌టులే వ‌ణికిపోతుంటారు. ఆయ‌న‌తో జోక్స్ చేయాల‌న్నా క‌లిసి ఫొటో దిగాల‌న్నా కూడా డేంజ‌రే. బాల‌య్య ఎప్పుడు ఎలా ఉంటారో చెప్ప‌డం చాలా క‌ష్టం. అయితే తాజాగా ఆయ‌న అంద‌రి మ‌న‌సుల్ని గెలుచుకొని శ‌భాష్ అనిపించేలా చేశాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం గోపీచంద్ మలినేని ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కర్నూలు జిల్లాలోని కర్నూలు పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. తాజాగా కర్నూలు షూటింగ్ నిమిత్తం వెళ్లిన బాలకృష్ణ గతంలో తాను కలుస్తానని మాట ఇచ్చిన ఒక అభిమాని ఇంటికి వెళ్లి భోజ‌నం చేశాడు.

Advertisement

ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది.బాలయ్య కొట్టినా తిట్టినా కూడా మ‌న‌సు వెన్న అంటూ కొందరు ఆ వీడియోకి కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ 107వ చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గా, ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో ఆయన పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో తేలిపోయింది. బాలయ్య భిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా `అఖండ` స్థాయిని అంతకంతకు పెంచేలా చిత్రం ఉంటుందని అభిమానులు ఎంతో కాన్పిడెంట్ గా ఉన్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

BalaKrishna Fans say Manasu Venna

Advertisement

BalaKrishna : మంచి మ‌న‌సు..

‘అఖండ’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ఈ సినిమా తెర‌కెక్క‌నుండ‌టంతో ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. పైగా ఇటీవ‌లే విడులైన బాల‌య్య పోస్ట‌ర్‌లు ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఈ చిత్రంలో బాల‌కృష్ణ‌కు జోడీగా శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ స్వ‌ర కర్త‌గా పనిచేస్తున్నాడు. ఈ చిత్రంతో బాల‌కృష్ణ మ‌రో హిట్ కొట్ట‌డం ఖాయం అంటున్నారు. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం మంచి వినోదం పంచడం ఖాయంగా క‌నిపిస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి