BalaKrishna : ఇటీవల బాలకృష్ణ .. అల్లు ఫ్యామిలీకి చాలా దగ్గరయ్యాడు.అన్‌స్టాపబుల్ షో నుండి బాలయ్య అల్లు ఫ్యామిలీ వేడుకలలో తెగ సందడి చేస్తున్నాడు. అల్లు శిరీష్ హీరోగా నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా, నవంబర్ 4వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో గ్రాండ్ గా జరిగింది. నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. మొదట నందమూరి అభిమానులకు, అల్లు అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గీతా ఆర్ట్స్ ను 1974లో స్థాపించారు .. ఆ ఏడాదిలోనే నేను సినిమాల్లోకి వచ్చాను .. అప్పుడు నాకు 14 ఏళ్లు.
అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ సంస్థను నిలబెడుతూ రావడం అంత తేలికైన విషయమేం కాదు. ముందు నుంచి కూడా అల్లు కుటుంబంతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని అన్నారు. ఇప్పుడొస్తున్న కొత్త దర్శకులంతా కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. అలా వచ్చిన సినిమానే ఇది. ఈ సినిమా ట్రైలర్ చూశాను. శిరీష్ బయటకూడా ఇంతేనా అనిపించింది. ఇక లాభం లేదు .. ఇతన్ని ‘అన్ స్టాపబుల్’ షోకి పిలిచి అన్ని విషయాలను బయటికి లాగుతాను. అనూ ఇమ్మాన్యుయేల్ చాలా అందంగా కనిపిస్తోంది. నటన కూడా బాగా చేసిందని తెలుస్తూనే ఉంది. అల్లు అరవింద్ తనకు, తన కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు బాలకృష్ణ.
మా కాంబినేషన్ లో వచ్చిన టాక్ షో ఎంత గొప్ప హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. అల్లు శిరీష్ గురించి చాలా మంది చెబితే విన్నాను. అతడు నా కుర్చీకే ఎసరు పెట్టే ప్రయత్నం చేశాడని అన్ స్టాపబుల్ షోని ఉద్దేశించి అన్నారు. ఈ విషయం చెప్పడంతో ప్రతి ఒక్కరు తెగ నవ్వేశారు. నా విషయానికి వస్తే నా అభిమానూలు కోరుకునే పాత్రలను చేస్తూ వెళతాను. వాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా నేను ఏ సినిమా చేయనని అన్నారు. వాళ్లపై బలవంతంగా నా ఇష్టాలను రుద్దాలనుకోనని బాలయ్య చెప్పుకొచ్చారు. మొత్తానికి బాలయ్య స్పీచ్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.