Aadarsha Kutumbam Movie Review : ఆదర్శ కుటుంబం మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!
Aadarsha Kutumbam Movie Review : విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం – AK47’ సినిమాపై…
Aadarsha Kutumbam Movie Review : విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం – AK47’ సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుంచీ మంచి అంచనాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరూ కలిసి పనిచేయడంతో సినిమా ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 30న థియేటర్లలో విడుదలైంది. సినిమా చూసిన కొందరు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. వారి పోస్టుల్లో వెంకటేష్ కామెడీ టైమింగ్, సత్య నటన, థమన్ సంగీతంపై ప్రశంసలు కనిపిస్తుండగా.. సెకండాఫ్‌లో కథనం నెమ్మదించిందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మరి ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఏమంటున్నారు? పూర్తి వివరాలు చూద్దాం. ‘ఆదర్శ కుటుంబం’లో వెంకటేష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటించారు. నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్‌బీర్ సంధు, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించగా, శ్రీమతి మమత సమర్పకులుగా వ్యవహరించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, రచన అందించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. తమన్ ఎస్ సంగీతం అందించగా, రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ వర్క్ బాధ్యతలు నిర్వహించారు.
Aadarsha Kutumbam Movie Review : ఆదర్శ కుటుంబం మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!
Aadarsha Kutumbam Movie Review ఫస్ట్ హాఫ్, కామెడీ, వెంకీ నటనపై ప్రశంసలు.. సత్యకు మంచి మార్కులు!
సినిమా చూసిన ఓ ప్రేక్షకుడు సోషల్ మీడియాలో స్పందిస్తూ తమన్ సంగీతాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఫ్యామిలీ సినిమాలకు సంగీతం అందించడంలో థమన్ టాలీవుడ్లో కీలకమైన బలంగా నిలుస్తున్నారని, ఈ చిత్రంలోనూ ఆయన వర్క్ చాలా బాగుందని పేర్కొన్నారు. సినిమాలోని కామెడీ సన్నివేశాలు కూడా బాగా నవ్వించాయని, వెంకటేష్ తనదైన స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ టైమింగ్‌తో మరోసారి ఆకట్టుకున్నారని అభిప్రాయపడ్డారు. మొత్తంగా వెంకటేష్–థమన్ కాంబినేషన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని ఆ ప్రేక్షకుడు తన పోస్టులో వెల్లడించారు. మరో ప్రేక్షకుడు వెంకటేష్, శ్రీనిధి శెట్టి జోడీ తెరపై బాగుందని పేర్కొన్నారు. సత్య కామెడీ, ఆయన నటన కూడా సినిమాకు అదనపు బలంగా నిలిచాయని ప్రశంసించారు. అయితే నారా రోహిత్, నివేదా పేతురాజ్ పాత్రలకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత లభించలేదని అభిప్రాయపడ్డారు. సాంకేతిక అంశాల విషయానికి వస్తే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్, విజువల్స్ సినిమాకు చక్కగా సహకరించాయని, పాటలు మాత్రం అంతగా ఆకట్టుకోలేదని తెలిపారు.
ఈ ప్రేక్షకుడి అభిప్రాయం ప్రకారం సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. విలన్ గ్యాంగ్‌కు సంబంధించిన సన్నివేశాలు, కామెడీ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ బాగా ఎలివేట్ అయిందని ప్రశంసించారు. అయితే ద్వితీయార్థంలో కథనం కొంత రొటీన్‌గా అనిపించిందని, మాల్ సీక్వెన్స్ పెద్దగా ప్రభావం చూపలేదని పేర్కొన్నారు. ట్రైన్ ఫైట్ సన్నివేశాలు కూడా అవసరానికి మించి సాగినట్లు అనిపించాయని తెలిపారు. సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను కనెక్ట్ చేయలేకపోయాయని అభిప్రాయపడ్డారు. మొత్తంగా ‘ఆదర్శ కుటుంబం’ను ఒక అబోవ్ యావరేజ్ వైలెంట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా అభివర్ణించారు.
Aadarsha Kutumbam Movie Review త్రివిక్రమ్ మార్క్ ఉందా? సెకండాఫ్‌పై మాత్రం మిశ్రమ స్పందన
మరో ప్రేక్షకుడు తన సోషల్ మీడియా రివ్యూలో ఫస్ట్ హాఫ్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ శైలి కనిపించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా హీరో పరిచయ సన్నివేశాలు గురూజీ మార్క్‌లో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ప్రారంభ భాగంలోని కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నాయని, ప్రీ-ఇంటర్వెల్ ట్విస్ట్‌తో పాటు ఆ తర్వాత వచ్చే ఫైట్ సీక్వెన్స్ సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చాయని తెలిపారు. అయితే సెకండాఫ్‌లో కథకు సంబంధించిన బ్యాక్‌స్టోరీ అంత బలంగా అనిపించలేదని, ఆ దశ నుంచి సినిమా వేగం తగ్గిందని పేర్కొన్నారు. సత్య కామెడీ మాత్రం బాగా వర్కౌట్ అయిందని ప్రశంసించిన ఆ ప్రేక్షకుడు, చివరి భాగంలో అవసరానికి మించిన పంచ్‌లు, కథనంలో కనిపించిన ల్యాగ్ సినిమాకు మైనస్‌గా మారాయని అభిప్రాయపడ్డారు. వెంకటేష్–త్రివిక్రమ్ కాంబినేషన్ నుంచి ఆశించే స్థాయిలో సినిమా లేదని పేర్కొన్నారు. ఈ ఇద్దరి అభిమానులు సినిమాను ఒకసారి చూడవచ్చని, అయితే వారి కాంబినేషన్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నవారికి కొంత నిరాశ కలిగే అవకాశం ఉందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఇదిలా ఉంటే, ప్రీమియర్ షో చూసిన మరో ప్రేక్షకుడు మాత్రం సినిమాపై చాలా పాజిటివ్‌గా స్పందించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి తనదైన శైలిని చూపించారని, ‘త్రివిక్రమ్ ఈజ్ బ్యాక్’ అంటూ ప్రశంసించారు. వెంకటేష్ కూడా పూర్తి ఫామ్‌లో కనిపించారని, తనదైన కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రీ-ఇంటర్వెల్ నుంచి సినిమాపై ఆసక్తి, ఉత్కంఠ మరింత పెరుగుతాయని, ఆ సమయంలో వచ్చే సన్నివేశాలు బాగా ఎగ్జైట్ చేశాయని తన పోస్టులో వివరించారు. మరో ప్రేక్షకుడి స్పందన మాత్రం సినిమా మొదటి భాగం, రెండో భాగం మధ్య ఉన్న తేడాను స్పష్టం చేసింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని, సెకండాఫ్ కూడా ఓ మోస్తరుగా ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నారు. అయితే చివరి 30 నిమిషాల్లో సినిమా గ్రాఫ్ కొంత తగ్గిందని అభిప్రాయపడ్డారు. సత్య కనిపించే ప్రతి సన్నివేశం మంచి కామెడీని పంచిందని, మొత్తంగా సినిమా చూసిన తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసిన అనుభూతి కలిగిందని తెలిపారు.
Also Read : Sai Pallavi : కాబోయే భర్తలో ఆ ఒక్క లక్షణం ఉండాల్సిందే.. జీవిత భాగస్వామిపై సాయిపల్లవి ఆసక్తికర కామెంట్స్..!
త్రివిక్రమ్‌ను ‘గురూజీ’గా సంబోధిస్తూ, ఆయన ఈ సినిమాను ఒక డీసెంట్ వెజ్ బిర్యానీలా అందించారని సరదాగా కామెంట్ చేశారు. అయితే చివరి భాగంలో మాత్రం సినిమా పవర్ కొంత తగ్గిందని పేర్కొన్నారు. అంతేకాకుండా ‘అజ్ఞాతవాసి’, ‘గుంటూరు కారం’ సినిమాలతో పోలిస్తే ‘ఆదర్శ కుటుంబం’ మెరుగ్గా ఉందని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ ప్రేక్షకుడు సినిమాకు 3.25/5 రేటింగ్ ఇచ్చారు. మొత్తంగా చూస్తే.. ‘ఆదర్శ కుటుంబం’పై సోషల్ మీడియాలో ఇప్పటివరకు వినిపిస్తున్న స్పందన మిశ్రమంగా ఉంది. వెంకటేష్ నటన, కామెడీ టైమింగ్, సత్య పెర్ఫార్మెన్స్, ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్ బ్లాక్, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు ప్రశంసలు దక్కుతున్నాయి. మరోవైపు సెకండాఫ్‌లోని కొన్ని సన్నివేశాలు, బ్యాక్‌స్టోరీ, చివరి భాగంలో కనిపించిన ల్యాగ్పై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ కొందరు ప్రేక్షకులు సోషల్ మీడియాలో పంచుకున్న అభిప్రాయాలు మాత్రమే. పూర్తి స్థాయి ప్రేక్షకుల స్పందన, సినిమా వసూళ్లను బట్టి ‘ఆదర్శ కుటుంబం’ థియేటర్లలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. Aadarsha Kutumbam Movie First Review , Aadarsha Kutumbam Movie Review , Aadarsha Kutumbam Review , ఆదర్శ కుటుంబం మూవీ రివ్యూ , ఆదర్శ కుటుంబం రివ్యూ , Venkatesh AK47 Movie, Trivikram Srinivas, Aadarsha Kutumbam , Aadarsha Kutumbam Review, Venkatesh Movie Review, Trivikram Srinivas, Aadarsha Kutumbam Twitter Review, Thaman Music







