balakrishna-is-great-in-this-accept-than-chiranjeevi
Chiranjeevi – Balakrishna: ఈ మధ్య మెగా అభిమానులు నందమూరి అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. దీనికి కారణం ఆర్ఆర్ఆర్, అఖండ, ఆచార్య సినిమాలు. బాలయ్య 100వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి తర్వాత మళ్ళీ హిట్ దక్కిందంటే అఖండ సినిమాతోనే. ఈ మధ్యలో వచ్చిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాపయ్యాయి. ఎన్ని ఫ్లాపులొచ్చినా బాలయ్య ఇమేజ్ తగ్గదు. అదే ఊపుతో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇక బాలయ్య కరోనా ప్యాండమిక్ ఉన్నా, ఏపీలో టికెట్ రేట్ పెంచక పోయినా అఖండ సినిమాతో నిర్మాతకు భారీ లాభాలను తెచ్చిపెట్టారు. దీనికి ముఖ్య కారణం సినిమా బడ్జెట్‌ను వీలైనంత కంట్రోల్ చేయడమే.
అంతేకాదు, షూటింగ్ కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేసి అఖండ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఒకసారి లాకయిన కథను బాలయ్య పొరపాటున వేలుపెట్టి కెలకరు. ఫైనల్ అయిన్ స్క్రిప్ట్‌తో సెట్స్ మీదకు వెళ్ళిపోతారు. అందుకే, బాలయ్య సినిమా షూటింగ్ త్వరగా పూర్తవుతుంది. ఈ విషయంలో బాలయ్య గ్రేట్ అని చెప్పక తప్పదు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇటు మెగా హీరో అటు నందమూరి హీరో నటించాడు. ఈ సినిమా రిలీజయ్యాక కూడా రక రకాల చర్చలు సాగాయి. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని చెపుకున్నారు. ఆ వేడి తగ్గిందనుకుంటే ఇప్పుడు ఆచార్య హడావుడి మొదలైంది. మెగా మల్టీస్టారర్‌గా వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది.
balakrishna-is-great-in-this-accept-than-chiranjeevi
దీనికి ముఖ్య కారణాలు ఇవే అంటూ ఇప్పుడు ఒక్కొక్కో విషయం బయటకు వస్తోంది. కొరటాల శివ పక్కా కథ తయారు చేసుకున్నప్పటికి దాన్ని మెగాస్టార్ చరణ్ పాత్ర నిడివి పెంచేందుకు పలు మార్పులు సూచించి స్క్రిప్ట్ మార్చారని టాక్ వినిపిస్తోంది. దానికి తోడు ఎంత కరోనా ప్యాండమిక్ అయినా కూడా నాలుగేళ్ళు ఓ సినిమా మీద సమయం, దానికి తగ్గట్టుగా బడ్జెట్ కేటాయించడంతో ఇప్పుడు తీవ్రంగా నష్టాలు వచ్చాయి. అదనపు షోలు, టికెట్ రేట్ పెరిగినా కూడా భారీ నష్టాలు వచ్చాయంటే ఆచార్య సినిమా విషయంలో మెగా ప్లాన్స్ అన్నీ తారుమారయ్యాయని చెప్పక తప్పదు. అందుకే, ఏ రకంగా చూసిన బాలయ్య గ్రేట్ అంటున్నారు. దీనిని మెగా ఫ్యాన్స్ ఒప్పుకోవడం లేదు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.