
Balakrishna opens up about Mokshagna Teja entry on film
Balakrishna : నందమూరి ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. కొద్ది రోజులుగా మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి ఎన్నో వార్తలు వస్తుండగా, వాటికి సంబంధించి క్లారిటీ రావడం లేదు. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి చిత్రం జనవరి 12న విడుదల కానుండగా,ఈ మూవీకి సంబంధించి కొద్ది రోజులుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. బాలకృష్ణ గతేడాది వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘అఖండ’ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతుండగా, అదే ఊపులోనే ఆయన కొత్త సినిమాలను వరుసగా లైన్‌లో పెట్టుకుంటోన్నారు. ఓ వైపు అన్ స్టాపబుల్ షోకి హోస్ట్ గా
అదరగొడుతూనే మరోవైపు సినిమాల్లో జోరు కొనసాగిస్తున్నారు.మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహారెడ్డి’ సినిమా చేస్తుండగా, ఈ మూవీ పల్నాడు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతుంది. ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఇప్పటికే పోస్టర్స్, పాటలు విడుదల చేయగా, వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియో విడుదల కాగా, సెట్ లో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ తేజ సందడి చేయడం చూపించారు. మోక్షజ్ఞ త్వరలో తన తండ్రితో కలిసి సందడి చేయడం పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మోక్షజ్ఞ ప్రస్తుత వయసు 28 ఏళ్ళు కాగా,
Balakrishna opens up about Mokshagna Teja entry on film
ఆయన ఎంట్రీ ఇవ్వకపోవడానికి కారణం… నటన ఇష్టం లేకనే అనే ఓ వాదన ఉంది. బిజినెస్ పట్ల మక్కువ చూపిస్తున్న మోక్షజ్ఞ, నేను నటుడిని కానని బాలయ్యతో పలుమార్లు చెప్పాడని, అందుకు మోక్షజ్ఞ మనసు మార్చేందుకు బాలయ్య ప్రత్యేక పూజలు, యజ్ఞయాగాదులు కూడా చేయించారని వినికిడి. అయితే ఈ ఏడాది ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 చిత్రంతో ఆరంగేట్రం చేయనున్నాడని తెలుస్తుంది. తాజా ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ.. ఈ ఏడాది ఆదిత్య 999 చేయబోతున్నట్టు చెప్పుకొచ్చాడు. నేను ఏమి అనుకోను. అదే జరిగిపోతుంది. దాని మీద నమ్మకం అంటూ బాలయ్య చెప్పుకొచ్చారు. ఏదేమైన ఈ ఏడాది తన కొడుకుని సినిమా పరిశ్రమకు బాలయ్య పరిచయం చేయనున్నాడని తెలుస్తుంది.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.