Balakrishna : బాలయ్య సంచలన నిర్ణయం.. మోక్షజ్ఞ ఎంట్రీ రాజమౌళితోనే..!!
Balakrishna : టాలీవుడ్ ఇండస్ట్రీలో నటసింహం బాలయ్యకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. యంగ్ హీరోలకు పోటీగా బాలయ్య వరుస సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు. ఇక ఆయన మాస్ లెగసీని నిలబెట్టే మోక్షజ్ఞ ఎప్పుడు ఇండస్ట్రీలోకి వస్తాడా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నందమూరి వారసుడు తెర మీద ఎప్పుడు కనిపిస్తాడు. ఎప్పుడు సెలబ్రేషన్స్ చేసుకోవాలని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్న తరుణంలో నందమూరి ఫ్యాన్స్ కి సోషల్ మీడియాలో ఓ గుడ్ న్యూస్ వైరల్ గా మారుతుంది. రాజమౌళి దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. అయితే బాలకృష్ణ స్వయంగా రాజమౌళి కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలాసేపు మాట్లాడటం జరిగిందట.
అయితే రాజమౌళి కూడా బాలకృష్ణ పై ఉన్న రెస్పెక్ట్ తో బాలకృష్ణ ఇంటికి వెళ్ళి మాట్లాడి కచ్చితంగా మోక్షజ్ఞతో సినిమా చేస్తానని, ఇప్పుడు మహేష్ బాబు తో ఒక సినిమా చేస్తున్నానని, ఆ సినిమా పూర్తయిన తర్వాత, మంచి కథ కుదిరితే తప్పకుండా చేస్తానని చెప్పారట. అయితే బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో లాంచ్ చేయాలా లేకపోతే ఆదిత్య 369 కు రీమేక్ గా ఆదిత్య 999 పేరుతో బాలకృష్ణ సొంతంగా దర్శకత్వం వహించాలని, తను కూడా నటిస్తూ మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వాలని ఆ మధ్య తెలిపారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ నడవడంతో మోక్షజ్ఞ డెబ్యును పాన్ ఇండియా వైడ్ గా లాంచ్ చేయాలని బాలకృష్ణ రాజమౌళిని అప్రోచ్ అయ్యారట. దీనికి రాజమౌళి కూడా ఒప్పుకున్నారట. ఇక రాజమౌళి స్టార్ హీరోలతోనే పాన్ ఇండియా సినిమాలు చేస్తారు. స్టార్డం వచ్చిన తర్వాత హీరోలతో సినిమాలు చేస్తారు. డెబ్యూ సినిమాలతో వచ్చిన హీరోలతో ఇంతవరకు చేయలేదు.
మోక్షజ్ఞ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా డెబ్యూ తో గుర్తింపు తెచ్చుకుంటాడని ఫ్యాన్స్ అంతా ట్వీట్స్ వేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాకి దర్శకుడు రాజమౌళి అయితేనే కరెక్ట్ గా సరిపోతారని, రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే ఆ హీరో కచ్చితంగా హిట్ కొడతాడు అని అందరూ భావిస్తుంటారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ కూడా తన తనయుడు మోక్షజ్ఞ ని పాన్ ఇండియా స్థాయిలో డెబ్యూ హీరోగా పరిచయం చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో అడ్వెంచర్ సినిమాను చేయబోతున్నారు. ఇక రాజమౌళి సినిమా అంటే విడుదల కావడానికి మినిమం మూడు సంవత్సరాలు పడుతుంది. అప్పటిదాకా మోక్షజ్ఞ ఆగుతాడా లేక మరో డైరెక్టర్ తో హీరోగా ఎంట్రీ ఇస్తాడా అనేది చూడాలి.
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
This website uses cookies.