Home » Entertainment » Bandla Ganesh Audio Clip Viral
Entertainment

Bandla Ganesh : త్రివిక్ర‌మ్ న‌న్ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రాకుండా చేస్తున్నాడ‌న్న బండ్ల గ‌ణేష్.. అస్స‌లు విష‌యం ఏంటి?

Authored By
Sam C
The Telugu News | Published on: February 22, 2022, 9:30 pm
Advertisement

Bandla Ganesh : బండ్ల గ‌ణేష్ సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేస్తూ తెగ వార్త‌లలో నిలుస్తూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ఇటీవ‌లి కాలంలో సినిమాలు త‌గ్గించి సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కి ద‌గ్గ‌ర అవుతున్నారు. అయితే ప‌వన్‌కి వీర భ‌క్తుడిగా చెప్పుకునే బండ్ల గ‌ణేష్‌కి ఓ నెటిజ‌న్ కాల్ చేశాడు. ఇందులో బండ్ల అభిమాని మాట్లాడుతూ.. ‘అన్న భీమ్లానాయక్‌ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌కు వెళ్తున్నావా.? స్పీచ్‌ ప్రిపేర్‌ చేసుకున్నావా.? ఈసారి చింపేయాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.దీనికి స్పందించిన బండ్ల గ‌ణేష్‌.. త్రివిక్రమ్‌..వైసీపీతో క‌లిసి నన్ను రావొద్దు అన్నాడంటా. అదే ఆలోచిస్తున్నాను. నాకు వెళ్లాలని ఉంది, కానీ పిలవలేరు. త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేసుకొని నన్ను రాకుండా చేస్తున్నాడు.

Advertisement

ఆడిటోరియం మొత్తం బండ్లన్న అని అరవండి, నేను స్టేజ్‌ మీదికి వస్తాను’ అని చెప్పుకొచ్చాడు.ఈ ఆడియోక్లిప్ వైర‌ల్ కాగా, దీనిపై బండ్ల‌గ‌ణేష్ ఓ ఛానెల్‌కు వివ‌ర‌ణ ఇచ్చారు. ఆ ఆడియో త‌న‌ది కాద‌ని, ఫేక్ ఆడియో అని, ఎవ‌రో మాట్లాడార‌ని కొట్టి పారేశారు. ఈ విష‌యంపై తాను స్పందించాల‌ని కూడా అనుకోవ‌డం లేదని అన్నాడు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను దేవ‌ర అంటూ పిలిచే బండ్ల గ‌ణేష్ వీరాభిమానం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలాగే పవ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ మ‌ధ్య ఉండే స్నేహం గురించి కూడా బండ్ల గ‌ణేష్‌కు తెలియంది కాదు. అలాంటిది త్రివిక్ర‌మ్‌పై బండ్ల గ‌ణేష్ అలా ఎలా మాట్లాడుతాడు అనే చ‌ర్చ కూడా న‌డిచింది.

bandla ganesh audio clip viral

Advertisement

Bandla Ganesh : ఆడియో క్లిప్ ర‌చ్చ‌..

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక ఫిబ్ర‌వ‌రి 21న జ‌ర‌గాల్సి ఉండ‌గా, ఇది వాయిదా ప‌డింది. మేక‌పాటి మృతితో కొద్ది రోజులు వాయిదా వేశారు. రేపు జ‌ర‌గ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ వేడుక‌లో బండ్ల గ‌ణేష్ కనిపిస్తే ఈ పుకార్ల‌న్నింటికి పులిస్టాప్ ప‌డ్డట్టే. శివ రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ అవుతుంది భీమ్లా నాయ‌క్. ఇందులో మ‌రో హీరోగా రానా ద‌గ్గుబాటి కూడా న‌టించారు. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను కూడా పూర్తి చేసుకుంది. ఇప్ప‌టికే విడుద‌లైన భీమ్లా నాయ‌క్ ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి