Home » Entertainment » Bandla Ganesh Emotional Words About Pawan Kalyan
Entertainment

Bandla Ganesh : నేను అనుభవిస్తున్న ఈ రాజయోగం అంతా దేవుడు పవన్ కళ్యాణ్ పెట్టిన బిక్ష.. నువ్వు లేకపోతే ఈ బతుకే లేదు అన్న

Authored By
Breaking News 2
The Telugu News | Published on: October 15, 2023, 4:00 pm
Advertisement

Bandla Ganesh : పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యక్తి మాత్రమే కాదు. ఆయన ఒక శక్తి. ఆయనకు అభిమానులు ఉండరు.. భక్తులు ఉంటారు. ఆయన్ను దేవుడిగా కొలిచేవారు కోకొల్లలు. తాజాగా బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు.. దశాబ్దాల నుంచి ఆయనతో తిరుగుతున్నాను. ఆయన చాలా నిజాయితీ పరుడు. నీతిమంతుడు. ఎవరు కష్టాల్లో ఉన్నా ఆ కష్టం నాది అని ముందుకెళ్లే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని బండ్ల గణేష్ కొనియాడారు. భోలా మనిషి. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా. జీవితంలో కొందరికి కొన్ని చేదు సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అది కూడా ఆయన ప్రమేయం లేకుండా జరిగింది. అదొక్కటే జరిగిందా? పవన్ లో మీరు చూడని వ్యక్తి ఉన్నారు. ఆయనకు సంబంధం లేని విషయాలకు గురించి పదే పదే మాట్లాడుతున్నారు.. అది చాలా బాధాకరం అంటూ బండ్ల గణేష్ స్పష్టం చేశాడు.

Advertisement

మీకు తెలుసో లేదో.. పవన్ కళ్యాణ్ ఈ సమాజానికి ఉపయోగపడే మనిషి. పవన్ కళ్యాణ్ దేశం కోసం బతుకుతున్న మనిషి. ఏరోజూ స్వార్థం కోసం కానీ.. స్వలాభం కోసం కానీ ఆయన ఏనాడూ ఆలోచించలేదు. ఆయన మాటల్లో, చేతల్లో చూడలేదు. సినిమా ఇండస్ట్రీలో ఆయన సూపర్ స్టార్. స్టార్ హీరోగా నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు. హాయిగా సినిమాలు చేసుకొని కోట్లకు కోట్లు సంపాదించుకోవచ్చు. మనం చనిపోయినా కూడా జనాలు గుర్తుపెట్టుకోవాలి. అది ఒక సంకల్పం. దాని కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నారు. జనం కోసం బతకాలని రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. నిస్వార్థంగా కష్టపడుతున్నారు. సినిమాల్లో ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును సినిమాల కోసం ఖర్చు పెడుతున్నాడు.. అని బండ్ల గణేష్ స్పష్టం చేశాడు.

Advertisement

Bandla Ganesh : ఒక్కరి దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా పార్టీని నడిపిస్తున్నారు

పవన్ కళ్యాణ్ ఒక్కరి దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా పార్టీని నడిపిస్తున్నారు. దయచేసి మీరంతా ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ మిత్రత్వం ఏంటో నాకు తెలుసు కాబట్టి చెబుతున్నా. ఎవరి కష్టాన్నైనా సరే తన కష్టంగా భావిస్తారు. ఆయనకు లేనిది ఒక్కటే కులాభిమానం. ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ స్టేటస్ మొత్తం ఆయన పెట్టిన భిక్షే. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. తెలిసీ తెలియకుండా పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తిని, మహానుభావుడిని, మనసున్న వాడి మీద అభాండాలు వేయకండి. నేను జనసేన పార్టీ అభ్యర్థిని కాదు.. కార్యకర్తను కాదు. పవన్ కళ్యాణ్ అభిమానిని, పవన్ కళ్యాణ్ మనిషిని.. అంటూ పవన్ కళ్యాణ్ గురించి బండ్ల గణేష్ స్పష్టం చేశారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి