Bandla Ganesh : పూరి జగన్నాథ్ ఛార్మీ బంధం గురించి ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వస్తుంటుంది. పూరి జగన్నాథ్ తన భార్య లావణ్యను వదిలేశాడని, చార్మీతో ఉంటున్నాడనే వార్తలు ఎక్కువగా వస్తుంటాయి. ఇక పూరి మొత్తంగా ముంబైకి మకాం మార్చేశాడని, అక్కడే ఛార్మీతో ఉంటున్నాడని అందరికీ తెలిసిందే. అయితే హైద్రాబాద్‌కు రావడం కూడా పూరి మానేసినట్టు కనిపిస్తోంది. కానీ తన కొడుకు ఆకాష్ సినిమా బాధ్యతలను మాత్రం పూరి చూసుకుంటున్నాడు. రొమాంటిక్ సినిమాకు నిర్మాత అవ్వడంతో దగ్గరుండి ప్రమోషన్స్ చేశాడు. కానీ ఆకాష్ నటించిన చోర్ బజార్ సినిమా ప్రమోషన్లలో మాత్రం పూరి కనిపించలేదు.
ఇక కన్న కొడుకు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే.. అతను రాలేదు. దీనిపై బండ్ల గణేష్ అసహనం వ్యక్తం చేశాడు. కన్న కొడుకు సినిమా ఫంక్షన్ ఉంటే రాలేకపోయావ్.. అంత బిజీగా ఏం ఉన్నావ్ అన్నా.. ముంబైలో ఏం చేస్తున్నావో నాకు తెలియడం లేదు.. మనం ఏం చేసినా కూడా పిల్లలే కోసం.. కన్న బిడ్డలను చూసుకోకపోతే ఇంకెందుకు అంటూ బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యాడు. పూరి జగన్నాథ్‌ను కార్నర్ చేశాడు బండ్లన్న. పూరి భార్య లావణ్య గురించి.. ఆమె సహనం, ఓర్పు, మంచిదనం గురించి ఎంతో గొప్పగా చెప్పాడు.సీతా దేవిని చూడలేదు కానీ ఆమెకున్నంత ఓర్పు ఉందని, కర్ణుడికి కన్న కుంతీదేవీకి ఉన్న సహనం, గొప్ప లక్షణాలున్నాయని చెప్పుకొచ్చాడు.
పూరి ఏదో పెద్ద దర్శకుడు అవుతాడని, ఇండస్ట్రీని దున్నేస్తాడని లావణ్య పెళ్లి చేసుకోలేదు.. జేబులో రెండొందల రూపాయలున్నప్పుడే చేసుకుంది.. సనత్ నగర్ గుళ్లో పెళ్లి చేసుకున్నారు.. పూరి పెద్ద దర్శకుడు అయ్యాక ఎంతో మంది వచ్చారు..కానీ వారికంటే ముందు లావణ్య వచ్చిందని పరోక్షంగా ఛార్మీని ఉద్దేశించి అన్నాడు. ర్యాంప్‌లు వ్యాంప్‌లు వస్తాయి పోతాయి.. కానీ తల్లిలాంటి లావణ్య మాత్రం ఎప్పటికీ ఉంటుంది.. ఆవిడను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఆకాష్‌ది, పవిత్రది, పూరి అన్నది అంటూ బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యాడు. అలా బండ్ల గణేష్ మాట్లాడుతుంటే.. లావణ్య కంట్లోంచి నీరు వచ్చినంత పనైంది.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.