
BB jodilalo yevaridi gelupu show deepika pilli anchoring trolls
Deepika Pilli : తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు దీపిక పిల్లి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఈ అమ్మడు ఈ టీవీ లో ప్రసారమైన ఢీ డాన్స్ షో తో సుదీర్ఘంగా ప్రేక్షకులను అలరించింది. ఆ షో లో రష్మితో కలిసి టీమ్ లీడర్ గా వ్యవహరించింది. రష్మీతో కలిసి డాన్స్ లు చేయడం ద్వారా పాపులారిటీని దక్కించుకుంది. ఢీ షో లో తన అందాలతో మెప్పించిన దీపిక ప్రస్తుతం స్టార్ మా లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్టార్ మాటీవీ లో టెలికాస్ట్ అవుతున్న స్టార్ కమెడియన్స్ షో కు యాంకర్ గా వ్యవహరిస్తున్న దీపిక పిల్లి మరో వైపు అదే ఛానల్లో ప్రసారమవుతున్న కొన్ని ప్రత్యేక షో లకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తుంది.తాజాగా బిగ్ బాస్ జోడి అంటూ వాలెంటైన్స్ డే సందర్భంగా ఒక భారీ ఈవెంట్ ను నిర్వహించారు.
అందులో గత బిగ్ బాస్ కంటెస్టెంట్ లు హాజరయ్యారు. ఆ సమయం లో ఈ అమ్మడి యాంకర్ మరియు వ్యవహారంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యాంకర్ రవి తో కలిసి ఈమె ఆ షో ను యాంకరింగ్ చేయడం జరిగింది. ఆ సమయంలో తనపై యాంకర్ రవి వేసిన పంచ్ లు మరియు ఇతర కంటెస్టెంట్స్ వెకిలి పంచ్ లకు ఏమాత్రం సరైన రియాక్షన్స్ ఇవ్వలేక పోయింది. ఆ సమయంలో నవ్వు రాకపోగా కాస్త చిరాకు పడ్డట్లుగా అనిపించింది. ఆమె హావభావాలు సరిగా లేవంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు అనూహ్యంగా బుల్లి తెరపై కి ఎంట్రీ ఇచ్చింది. బుల్లి తెరపై ఢీ షో లో కనిపించినా అక్కడ టీమ్ లీడ్ గా చేసింది కాని యాంకరింగ్ చేయలేదు.
BB jodilalo yevaridi gelupu show deepika pilli anchoring trolls
యాంకర్ గా చేయడం కొత్త కావడం వల్ల ప్రస్తుతం కంగారు పడుతుంది. ప్రతి దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక కింద మీద పడుతుంది. యాంకర్ రవి సందర్భానుసారంగా డబల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతాడు. అలాంటి సమయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక షో మొత్తం కూడా దీపికా పెళ్లి అవస్థలు పడ్డట్లుగా కనిపించింది. ఈ అమ్మడు మళ్లీ తన తప్పులను సరిదిద్దుకుని ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి. ఇలాగే ఉంటే కెరియర్ లో కష్టం.. కాస్త అప్డేట్ అవ్వాలి అమ్మడు అంటూ ప్రేక్షకులు మరియు బుల్లి తెర వర్గాల వారు దీపికా పిల్లికి సలహాలు ఇస్తున్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.