
Mahesh Babu will benefit if Rajamouli is locked
Mahesh Babu : హిట్ చిత్రాల దర్శకుడు రాజమౌళి ఇటీవలి కాలంలో తన సినిమాల కోసం ఏళ్లకు ఏళ్లు టైం స్పెంట్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో అత్యద్భుతమైన చిత్రాలు చేస్తూ తెలుగోడు కాలర్ ఎత్తుకునేలా చేస్తున్నాడు. బాహుబలి సినిమాతో తన సత్తా ఏంటో చూపిన రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈమూవీ మార్చి 25న విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత మహేష్‌తో క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు రాజమౌళి. ఇప్పటికే దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది. అయితే ఇటీవలి కాలంలో ఈ సినిమాకి సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
తాజాగా మహేష్ – రాజమౌళిల సినిమా ఓ మల్టీస్టారర్ అని ఇందులో మరో అగ్ర హీరోకూడా నటించబోతున్నాడు అని ప్రచారం నడుస్తుంది. ఈ సినిమాలో 40 నిమిషాల వ్యవధిగల ఓ కీలకమైన ఎపిసోడ్ ఉంది. ఆ ఎపిసోడ్ కోసం ఓ పెద్ద హీరో కావాలి. అందుకోసం ఓ టాలీవుడ్ స్టార్‌నే ఎంచుకోవాలని చూస్తున్నాడట.`ఆర్.ఆర్.ఆర్`లో ఇద్దరూ తెలుగు హీరోలే అయినప్పటికీ భారీ బిజినెస్ జరిగింది. ఇప్పుడు ఈ సినిమా కోసం తెలుగు హీరోనే దించే ప్రయత్నంలో ఉన్నాడట. అయితే ఆ హీరోతో 40 నిమిషాల పాటు సాగే ఆ ఎపిసోడ్ మాత్రం అదిరిపోయే స్థాయిలో డిజైన్ చేయబోతున్నారట.
rajamouli big plan with mahesh babu
ప్రస్తుతం మహేశ్ బాబు – రాజమౌళి సినిమాకు సంబంధించిన కథా చర్చలు నడుస్తున్నాయి. ఇక ఈ సినిమాలో విలన్‌గా గోపిచంద్‌ని తీసుకోబోతున్నట్టు చర్చ నడుస్తుంది. గతంలో వర్షం సినిమాలో కూడా గోపీచంద్ విలన్‌గా చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ అనే మూవీని చేస్తున్నాడు. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. హీరోగా చేస్తున్నా కూడా కొందరు విలన్‌గా అలరిస్తున్నారు. ఇప్పుడు గోపిచంద్‌తో కూడా మిరాకిల్ చేయాలని రాజమౌళి భావిస్తున్నాడట.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.