Home » Entertainment » Best Film Oscar Award Won Everything Everywhere All At Once
Entertainment

Oscar 2023: ఉత్తమ చిత్రం కేటగిరీలో ఆస్కార్ అవార్డు గెలిచిన “ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్”..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: March 13, 2023, 9:41 am
Advertisement

Oscar 2023: అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎన్నడూ లేని రీతిలో ఈసారి ఆస్కార్ రేసులో భారతీయ సినిమాలు సత్తా చాటాయి. ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో “RRR” నాటు నాటు సాంగ్, ఉత్తమ షార్ట్ ఫిలిం విభాగంలో “ది ఎలిఫెంట్ విస్పరర్స్”… ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకోవడం జరిగింది.

Advertisement

కాగా ఈ ఏడాది ఉత్తమ చిత్రం ఆస్కార్ అవార్డు “ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్” మూవీ సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం క్యాటగిరిలో మాత్రమే కాకుండా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ కేటగిరిలో కూడా “ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్” అవార్డులు గెలవడం జరిగింది. దీంతో 95వ ఆస్కార్ పురస్కారాలలో ..”ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్” అత్యధిక అవార్డులు గెలిచిన సినిమాగా నిలిచింది.

Best Film Oscar award won everything everywhere all at once

Advertisement

ఈ సారి ఆస్కార్ బరిలో  ఏకంగా 11 నామినేషన్ లలో “ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్” అర్హత సాధించి సంచలనం సృష్టించింది. ఆస్కార్ కీ ముందే ఈ సినిమా పలు ప్రతిష్టాత్మక అవార్డులు గెలవడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా మూడు విభాగాలలో “ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్” సినిమా ఆస్కార్ అవార్డు గెలవటం సంచలనంగా మారింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి