bheemla nayak Movie trailer released
Bheemla Nayak : కరోనా వలన చాలా సినిమాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. గత ఏడాది పుష్ప, అఖండ చిత్రాలు విడుదల కాగా, ఇది రెండు మంచి విజయాన్ని సాధించాయి. ఇక ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా ప్రేక్షకులని అలరించేందుకు సిద్దమవుతుంది. మలయాళం హిట్ మూవీ అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న భీమ్లా నాయక్ పై రోజురోజుకు అంచనాలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఇక సినిమాకు సంబంధించిన పాటలు కూడా ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఇక ప్రస్తుతం అందరూ ట్రైలర్ కోసమే ఎదురుచూస్తున్నారు.
సీతారా ఎంటర్టైన్మెంట్స్ లో నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించాడు.కొద్ది సేపటి క్రితం ట్రైలర్ విడుదల కాగా, ఇందులో యాక్షన్ సన్నివేశాలు కేక పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా రానా, పవన్ కళ్యాణ్ మధ్య కేక పెట్టించేలా సన్నివేశాలు ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకి మంచి వినోదం అందిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే అభిమానులకి పూనకాలు వస్తున్నాయి.
ఏంటి బాలాజీ.. స్పీడు పెంచావు.. పులి పెగ్గేసుకొని పడుకొంది కానీ.. నువ్వు స్లోగానే పోనీ. అంటూ రానా దగ్గుబాటి వాయిస్‌తో డానీ.. డేనియల్ శేఖర్.. ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ మొదలైంది. సరిహద్ భీమ్లా నాయక్.. సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్.. శ్రీశైలం తహశీల్.. హఠకేశ్వర మండలం.. ఆంధ్ర ప్రదేశ్.. డ్యూటీకి పవర్‌కు మధ్య జరిగిన క్లాషెస్‌ను ఈ సినిమాలో చూపించారు. మొత్తంగా భీమ్లా వర్సెస్ డేనియర్ శేఖర్ గా పవన్ కళ్యాణ్, రానాల మధ్య సన్నివేశాలు అదిరిపోయాయి. నేను ఇవతల ఉంటేనే చట్టం.. అవతలకు వస్తే కష్టం అని పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ బాగుంది. నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్న ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి. ఇదిలా ఉంటే భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా రంగం సిద్ధం అయిన విషయం తెలిసిందే.
bheemla nayak Movie trailer released
ఈనెల 21వ తేదీన హైదరాబాద్ లోనే యూసుఫ్ గుడా పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించాలని అనుకున్నారు. ఇక ఈ వేడుకకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రతి ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు అంతేకాకుండా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ వేడుకకు హాజరు కానున్నట్లు అఫీషియల్ గా తెలియజేశారు. కాని గౌతమ్‌రెడ్డి మృతికి సంతాపంగా ‘భీమ్లా నాయక్’ ప్రీరిలీజ్ వేడుక వాయిదా పడింది. ప్రీరిలీజ్ వేడుక వాయిదా వేసినట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకటన చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటిస్తోన్న ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది.
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
This website uses cookies.