#image_title
Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ లో ఏం జరుగుతోంది. వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వాళ్లలో అర్జున్ ను వదిలేసి అశ్విని, భోలే షావలిని పట్టుకున్నారు పాత హౌస్ మెట్స్. అంబటి అర్జున్ కూడా స్టార్ మా నుంచి వచ్చిన వ్యక్తే కావడంతో అతడిని స్టార్ మా బ్యాచ్ ఓన్ చేసుకుంది. ఇక మిగిలిన పూజా మూర్తి తను ఎప్పుడు ఎటువైపు ఉంటుందో ఎవ్వరికీ అర్థం కాదు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన నయని పావని తొలి వారమే బయటికి వెళ్లిపోయింది. ఇక.. మిగిలిన భోలే షావలి, అశ్వని.. ఈ ఇద్దరినే పాత కంటెస్టెంట్లు, వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన అర్జున్, పూజ కూడా టార్గెట్ చేశారు. దాదాపుగా ఈ ఇద్దరికే ఈ వారం ఎక్కువ నామినేషన్ ఓట్లు పడ్డాయి. ముఖ్యంగా అంబటి అర్జున్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, పూజ, సందీప్ మాస్టర్.. ఇలా ఎక్కువ మంది భోలే షావలి, అశ్వనినే నామినేట్ చేశారు.
మీరు ఈ షోకు టైమ్ పాస్ కు వచ్చినట్టుగా కనిపిస్తోంది. మీరు టైమ్ పాస్ కి ఈ షోకి వస్తే మాత్రం ఇలాంటి షో మీకు కరెక్ట్ కాదు. ఎప్పుడూ నవ్వుతూ ఉన్నట్టుగా నటిస్తున్నారు. ఎంటర్ టైమ్ మెంట్ చేస్తున్నట్టుగా నటిస్తున్నారు. మీరు ఈ షోకు కరెక్ట్ కాదు. మీ ఆట మీరు ఆడటం లేదంటూ భోలేను టార్గెట్ చేసేశారు కంటెస్టెంట్లు. దీంతో ఎక్కువ ఓట్లు భోలేకే పడ్డాయి. ఆ తర్వాత ఎక్కువ ఓట్లు అశ్వనికి పడ్డాయి. అశ్వని అన్న ఒక్క గ్రూప్ అనే పదాన్ని పట్టుకొని చాలామంది నామినేట్ చేశారు. దీంతో అశ్వని కూడా ఒక్కోసారి టెంపర్ ను కోల్పోయింది. తనకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలా.. హౌస్ మెట్స్ అంతా ఏకపక్షంగా భోలే షావలి, అశ్వని ఇద్దరినే టార్గెట్ చేసి నామినేట్ చేశారు.
#image_title
ఆ తర్వాత ప్రియాంక జైన్, శోభా శెట్టి.. ఇద్దరూ భోలే షావలి తమను నామినేట్ చేస్తే అస్సలు తీసుకోలేకపోయారు. నామినేట్ చేయడానికి సరైన రీజన్ చెప్పు అంటూ అతడిపై విరుచుకుపడ్డారు. వాళ్లు ఎన్ని మాటలు అన్నా భోలే మాత్రం చాలా కూల్ గా వ్యవహరించాడు. భోలే షావలిని నామినేట్ చేసేటప్పుడు కూడా ఆయన చాలా కూల్ గా ఉన్నాడు. కానీ.. భోలేపై మాత్రం ఇద్దరు చేసిన అరాచకం మామూలుగా లేదు. ఒక సామాన్య వ్యక్తి హౌస్ లోకి వస్తే చాలు.. అప్పుడు ప్రశాంత్ ను ఇలాగే టార్గెట్ చేశారు.. ఇప్పుడు భోలేను టార్గెట్ చేస్తున్నారు. భోలే పిచ్చోడు… ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు.. అన్నట్టుగా బయట జనాలకు చూపించాలని స్టార్ మా బ్యాచ్ తెగ ఆరాటపడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రశాంత్ ను ఇలాగే టార్గెట్ చేసిన స్టార్ మా చివరకు తామే తప్పు చేసినట్టు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు భోలే విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
This website uses cookies.