JR NTR : ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫిజిక్ చాలా భయంకరంగా ఉండేది. ఇండస్ట్రీ స్టార్టింగ్ లో స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి సినిమాలలో బొద్దుగా ఉన్నాగాని హీరోగా కెమెరాకి బాగానే అనిపించేవాడు. కానీ ఆ తర్వాత సినిమాలలో మరీ ఒళ్ళు రావడంతో… పాటు సినిమాలు పరాజయాలు పాలు కావడంతో ఎన్టీఆర్ కెరియర్ అప్పట్లో చాలా డేంజర్ జోన్ లో పడింది. “సింహాద్రి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాలు దాదాపు అట్టర్ ప్లాప్ అయిపోయాయి. అటువంటి సమయంలో తారక్ “యమదొంగ” సినిమా కోసం… చాలా బరువు తగ్గటం జరిగింది.
అప్పటినుండి మంచి ఫిజిక్ మెయింటైన్ చేసుకుంటూ తిరుగులేని కెరియర్ తో అద్భుతమైన సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇటీవలే “RRR” తో అంతర్జాతీయ స్థాయిలో తారక్ తనకంటూ స్పెషల్ మార్కెట్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తన ఫిజిక్ ఫిట్ నెస్ సీక్రెట్ కి సంబంధించి తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అదేమిటంటే.. ఎన్టీఆర్ తన ఫిజిక్ కంట్రోల్ తప్పకుండా మళ్లీ పెరగకుండా ఉండటం పైన చాలా కేర్ తీసుకుంటాడు అంట. దీనిలో భాగంగా ప్రతిరోజు ఉదయం లెగిసిన వెంటనే యోగా లేదా ఎక్సర్సైజ్ కనీసం రెండు గంటలపాటు చేస్తారని సమాచారం. ఆ తరువాత రెండు గ్లాసులు రాగి జావ తాగుతారట.
ఆ పైన నానబెట్టిన బాదంపప్పు వంటి డ్రైఫ్రూట్స్ తీసుకుంటారని సమాచారం. ఆ తర్వాత రెండు ఉడకబెట్టిన కోడిగుడ్లను తింటారట. ఆ తర్వాత మొత్తం చాలావరకు ఫ్రూట్ జ్యూసులతోనే తారక్ ఎక్కువగా గడిపేస్తారట. ఒక మధ్యాహ్నం భోజనంలో కూడా కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువగా ఉండేలా రాగిసంకటి, నాటుకోడి తింటారట. రాత్రిపూట నానబెట్టిన మొలకలు వచ్చిన త్రనాధాన్యాలు తప్ప మరేమీ ముట్టుకోరట. రోజు మధ్యలో ఎప్పుడు ఆకలి అనిపించిన ఫ్రూట్ జ్యూస్ లతో తప్ప మిగతా వాటితో కడుపు నింపుకోనే ప్రయత్నం తారక్ అసలు చేయడట. మరి ముఖ్యంగా ఎక్కువగా ఆయిల్ మరియు డీప్ ఫ్రై చేసే వాటిని అస్సలు దరిచేరనివ్వడట. ఈ రకంగా జూనియర్ ఎన్టీఆర్ తన ఫిట్నెస్ నీ కాపాడుకుంటాడట.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.