Home » Entertainment » Big News Heroin Swathi Take Divorce
Entertainment

Big News : విడాకులు తీసుకోబోతున్న హీరోయిన్ కలర్స్ స్వాతి ..!

Authored By
aruna
The Telugu News | Published on: July 18, 2023, 8:10 pm
Advertisement

కలర్స్ స్వాతి: ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో సెలబ్రిటీలంతా వరుసగా విడాకులు తీసుకుంటూ అభిమానులను షాకింగ్ కి గురిచేస్తున్నారు. ఈమధ్య మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకులు తీసుకొని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచారు. అయితే తాజాగా మరో హీరోయిన్ విడాకులు తీసుకోబోతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు. ‘ అష్టా చమ్మ ‘ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన స్వాతి తొలి సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

ఆ తర్వాత ఆమె వరుస సినిమాలు చేసినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. దీంతో ఈ బ్యూటీ ఇండస్ట్రీకి దూరమైపోయింది. ఆ తరువాత తన ఫ్రెండ్ అయినా వికాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి పెళ్లి తర్వాత ఆయనతో చాలా సంతోషంగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేసింది. అయితే ఏమైందో తెలియదు కానీ సడన్గా కలర్స్ స్వాతి తన భర్త ఫోటోలను పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ ఖాతాలో డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమె విడాకులు తీసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

Big News Heroin Swathi take divorce

Advertisement

ఇటీవల కాలంలో అందరూ అలాగే చేస్తున్నారు. విడాకులు తీసుకునే ముందు తమ పెళ్ళి ఫోటోలను డిలీట్ చేస్తూ తమ భర్తలను అన్ ఫాలో చేస్తున్నారు. మొదటగా సమంత ఆ తర్వాత నిహారిక ఇలాగే తమ విడాకుల విషయాలపై హింట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే రీసెంట్గా స్వాతి కూడా త్వరలోనే విడాకులు తీసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇది నిజమో కాదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుంది. ఈ విషయంపై స్వాతి స్పందించాల్సి ఉంది. అయితే స్వాతి హైదరాబాదులో సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉంటే ఆమె భర్త వికాస్ థాయిలాండ్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడడంతో విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి