Bigg Boss 6 Telugu 5th week housemate originality exposed
Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో వారాలు గడుస్తున్నా కొద్దీ హౌస్ మెట్స్ అసలు ఆట బయటపడుతుంది. ముఖ్యంగా ముందునుండి సేఫ్ గేమ్ ఆడాలని అనుకునే వారికి వారాలు గడుస్తున్నా కొద్దీ ఆట మార్చే పరిస్థితి వస్తుంది. అందుకే ఎప్పుడూ ఒకేలా ఉండట అసలు కుదరదు. లేటెస్ట్ ఎపిసోడ్ చూస్తే అదే అర్ధమవుతుంది. మొదటి వారం నుంచి మిస్టర్ కూల్ గా చాలా సైలెంట్ గా ఉంటూ వచ్చిన బాలాదిత్య సడెన్ గా ఓ టాస్క్ విషయమై గీతు రాయల్ మీద ఫైర్ అయ్యాడు. బాలాదిత్యకి కోపం రాదు.. శాంతపరుడు అన్న ట్యాగ్ ఇచ్చేశారు హౌస్ మెట్స్.
కానీ నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం బాలాదిత్యకి కోపం వచ్చింది. అతను చెప్పే మాటలు వినకుండా గీతు వాదన పెట్టుకోగా అతని సహనం కోల్పోయి అరిచేశాడు. అయితే బాలాదిత్యాకి కోపం వస్తుందా..? ఇన్నాళ్లు బాలాదిత్య ఈ కోపాన్ని ఎక్కడ దాచి పెట్టాడు..? హౌస్ లో ఎలాంటి పెద్ద గొడవ జరిగినా దాన్ని సర్ధి చెప్పే ప్రయత్నం చేసే బాలాదిత్య ఇలా ఫైర్ అవడానికి రీజన్ ఏటని ఆడియన్స్ ఆలోచిస్తున్నారు. బాలాదిత్య అసలు గేం ఇదేనా.. సేఫ్ గా ఆడుతూ సైలెంట్ గా టైటిల్ కొట్టేద్దాం అనుకున్నాడా అన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. బాలాదిత్య ఇప్పటికే టాప్ 5 కంటెస్టంట్ అని అందరు ఫిక్స్ అయ్యారు.
Bigg Boss 6 Telugu 5th week housemate originality exposed
అయితే తను ఎంత సైలెంట్ గా ఉంటున్నా నాగార్జున గారు తనని పొగడటం లేదని క్లారిటీ వచ్చిన బాలాదిత్య ఇక మీదట ఆట తీరు మార్చాలని అనుకుంటున్నాడు. అందుకే అతను తన ఆవేశాన్ని.. కోపాన్ని కూడా బయట పెట్టాలని చూస్తున్నాడు. శుక్రవారం ఎపిసోడ్ లో గీతు మీద అరిచేశాడు బాలాదిత్య. గీతుకి తనతో ఓ మంచి రిలేషన్ ఉంది. ఒకవేళ తను అరిచినా ఆమె పట్టించుకోదు అన్న కారణంగా అక్కడ కూడా బాలాదిత్య సేఫ్ గేమ్ ఆడాడా అన్న డౌట్ కూడా వస్తుంది. ఏది ఏమైనా ఐదో వారానికి గానీ బాలాదిత్య అసలు రూపం బయటపడ్డదని ప్రేక్షకులు భావిస్తున్నారు.
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
Special Song | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘OG (They Call Him…
Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు తాజా తీర్పు…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ (They Call Him OG)’…
Akhanda 2 | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ ప్రస్తుతం షూటింగ్…
This website uses cookies.