Home » News » Brahmamudi 2026 February 28th Saturday Episode Highlights
News

Brahmamudi 2026 February 28th Episode : కావ్య బిడ్డ ప్రాణాలతో రేఖ బేరం.. ఆస్తి రాయించుకుని సుభాష్‌కి చిత్రహింసలు

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: February 28, 2026, 9:00 am
Advertisement

Brahmamudi 2026 February 28th Episode : స్టార్ మా ఛానల్‌లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ ‘బ్రహ్మముడి’ Brahmamudi రోజురోజుకూ ఊహించని మలుపులతో ప్రేక్షకులను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది. రాజ్, కావ్యల మరణం తర్వాత దుగ్గిరాల కుటుంబం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రుద్రాణి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన రేఖ.. ఇప్పుడు ఆ ఇంటిని, ఆస్తిని తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు రాక్షసంగా మారుతోంది. ఈరోజు ఫిబ్రవరి 28 శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంట్లో రేఖ చేసిన అరాచకం, అపర్ణ పడిన వేదన ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. ఆ హైలైట్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

Advertisement

Brahmamudi 2026 February 28th Episode : కావ్య బిడ్డ ప్రాణాలతో రేఖ బేరం.. ఆస్తి రాయించుకుని సుభాష్‌కి చిత్రహింసలు

Brahmamudi 2026 February 28th Episode దుగ్గిరాల ఇంట్లోకి రేఖ ఎంట్రీ.. అపర్ణ వార్నింగ్

దుగ్గిరాల వారింట్లో అడుగుపెట్టబోతున్న రేఖను అపర్ణ అడ్డుకోవడంతో ఎపిసోడ్ ఉత్కంఠగా మొదలవుతుంది. అపర్ణ ఎంత అడ్డుకున్నా లెక్కచేయని రేఖ దర్జాగా ఇంట్లోకి వస్తుంది. “పవర్‌లో లేని పొలిటిషన్‌కి, అన్ని కోల్పోయిన నీలాంటి ఇంటి పెద్ద మాటలకు ఎలాంటి విలువ ఉండదు. ఇంతపెద్ద సామ్రాజ్యాన్ని నువ్వు ఒక్కదానివే ఎలా పాలించగలవు? అందుకోసమే నేను పెళ్లి చేసుకుని ఈ మందిమార్బలంతో వచ్చాను” అంటూ రేఖ తన అహంకారాన్ని ప్రదర్శిస్తుంది. దుగ్గిరాల ప్రాపర్టీని తన చేతుల్లో పెడితే కంటికి రెప్పలా చూసుకుంటానని అంటుంది. దానికి అపర్ణ దీటుగా బదులిస్తూ.. “నువ్వు తలచుకుంటే ఈ ఇంటి ముందు గడ్డిపోచను కూడా కదపలేవు. నేను అనుకుంటే నిన్ను జీవితాంతం జైల్లో కూర్చోబెట్టి చిప్పకూడు తినిపిస్తాను” అని వార్నింగ్ ఇస్తుంది.

Advertisement

Brahmamudi 2026 February 28th Episode కావ్య బిడ్డపై కత్తి.. సుభాష్‌కి చిత్రహింసలు

అపర్ణ మాటలకు రేఖ రెచ్చిపోతుంది. “ఒకసారి నీ కొడుకుని, కోడల్ని చంపిన మా అమ్మను గుర్తుచేసుకో. నా తల్లి అంత చేసినప్పుడు, ఆమె రక్తాన్ని పంచుకుపుట్టిన నేను ఎంతకైనా తెగిస్తాను. కళ్లముందు నీ కొడుకు, కోడలు ప్రాణాలు వదిలేస్తున్నా భరించగలిగావు.. మరి అదే కళ్లముందు నీ వారసురాలిని చంపేస్తే ఇలాగే చూస్తూ నిలబడగలవా?” అని బెదిరిస్తుంది. అదే సమయంలో రేఖ భర్త.. కావ్య బిడ్డను చంపాలని చూస్తాడు. అడ్డుకోబోయిన సుభాష్‌ను రేఖ వదిన కర్రతో దారుణంగా కొట్టడంతో అతను కిందపడిపోతాడు.

నా తల్లిని చంపిన మిమ్మల్ని వదిలిపెట్టనని, పేపర్ల మీద సంతకాలు చేయమని రేఖ డిమాండ్ చేస్తుంది. అపర్ణ ధైర్యంగా.. “నేను సంతకం చేస్తే ఈ ఇంట్లో ఆవగింజ కూడా నీ సొంతం కాదు” అని బాంబ్ పేలుస్తుంది. ఆస్తి మొత్తం కావ్య పేరు మీద ఉందని, ఆమె చనిపోవడంతో లీగల్‌గా ఈ ఆస్తి మొత్తం కావ్య కూతురికి (పాతికేళ్లు వచ్చాక) చెందుతుందని చెబుతుంది. తను కేవలం గార్డియన్‌గా మాత్రమే ఉంటానని, పిచ్చి వేషాలు వేస్తే ఆస్తి మొత్తం దుగ్గిరాల ట్రస్ట్‌కి వెళ్లిపోతుందని చెప్పడంతో రేఖ గ్యాంగ్ అంతా షాక్ అవుతుంది.

Advertisement

గార్డియన్‌గా రేఖ సంతకం.. కుప్పకూలిన సుభాష్

రాజ్, కావ్యలు పకడ్బందీగా డాక్యుమెంట్స్ రెడీ చేశారని తెలిసి రేఖ రగిలిపోతుంది. ఆస్తి కోసం అపర్ణపై దాడికి దిగుతుంది. పాపకు పాతికేళ్లు వచ్చాక ఆస్తిని సొంతం చేసుకుందామని ప్లాన్ మార్చి.. ఆస్తికి గార్డియన్‌గా తనను నియమిస్తూ సంతకం పెట్టాలని అపర్ణను బెదిరిస్తుంది. లేదంటే మనవరాళ్లతో పాటు సుభాష్‌ను చంపేస్తానని భయపెట్టడంతో, గత్యంతరం లేక అపర్ణ సంతకం చేసేస్తుంది. ఇకపై ఈ ఇంటికి నేనే మహారాణిని అంటూ రేఖ ఆర్డర్స్ వేస్తుంది.

రేఖ చేతికి పవర్ వెళ్లడంతో సుభాష్ తీవ్రంగా కుమిలిపోతాడు. రుద్రాణి లాగే రేఖ కూడా కంటికి కనిపించని శత్రువులా మారిందని, ఏ క్షణంలో ఏ ప్రమాదం వస్తుందోనని భయపడతాడు. అయితే, శత్రువును దూరం పెట్టడం వల్లే కుటుంబాన్ని పోగొట్టుకున్నామని, కళ్లెదురుగా ఉంచుకుని మనవరాళ్లను కాపాడుకోవడమే ఇప్పుడు తమ లక్ష్యమని అపర్ణ అతడికి ధైర్యం చెబుతుంది.

స్వరాజ్ ఎంట్రీ..

మరోవైపు స్వరాజ్ అనే పిల్లాడి ట్రాక్ నడుస్తుంది. నీ పేరు ఏంటి, అమ్మానాన్న ఎక్కడ అని అడిగితే ఆ పిల్లాడు ఏమీ చెప్పలేకపోతాడు. అతడికి భోజనం పెట్టి జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే గతం తాలూకు ప్రమాదం గుర్తొచ్చి స్వరాజ్ నిద్రలోంచి ఉలిక్కిపడి లేవడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.

కన్నవాళ్లు లేని ఆ పసిబిడ్డను అపర్ణ, సుభాష్‌లు రేఖ రాక్షస చేష్టల నుంచి ఎలా కాపాడుకుంటారు? స్వరాజ్ గతం ఏంటి? తెలుసుకోవాలంటే రాబోయే ఎపిసోడ్స్ చూడాల్సిందే.

Advertisement

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి