Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ ఎంటర్‌టైన్‌మెంట్ షో మరింత రసవత్తరంగా మారుతుంది. ఏ కంటెస్టెంట్ ఎప్పుడు ఎలా ఉంటాడో, ఏ కంటెస్టెంట్ హౌజ్ నుండి బయటకు వెళతాడో అనేది చెప్పడం కష్టంగానే ఉంది. అయితే గత ఎపిసోడ్ లో కిచన్ టైమర్ ఆపేసి కంటెస్టెంట్స్ ను టెన్షన్ పెట్టాడు బిగ్ బాస్. కిచన్ టైం పెరగాలంటే అవినాష్, రోహిణి చిన్న పిల్లలుగా మారుతారు. వాళ్లు అడిగింది కాదనకుండా ఇవ్వాలి అప్పుడు కిచన్ టైం పెరుగుతుంది అని చెప్పుకొచ్చాడు. దాంతో అవినాష్, రోహిణి చిన్నపిల్లల గెటప్స్ వేసుకొని నవ్వులు పూయించారు. అవినాష్ లేడీ కంటెస్టెంట్స్ దగ్గరకు వెళ్లి ముద్దు కావలి, ఎత్తుకోవాలి అంటూ హడావిడి చేశాడు. ప్రేరణ, నయని, యష్మీ అవినాష్ ను ఎత్తుకున్నారు.
దాంతో మరో రెండు గంటలు కిచన్ టైమర్ పెంచాడు బిగ్ బాస్. అలాగే అవినాష్, రోహిణికి ఐస్ క్రీమ్ లు పంచిపెట్టాడు బిగ్ బాస్. హౌస్ లో చివరి టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్. ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నిఖిల్ అండ్ గ్యాంగ్ దారుణంగా ట్రోలింగ్ కి గురవుతున్నారు. నిఖిల్ గ్యాంగ్ లో అతడితో పాటు యాష్మి, ప్రేరణ, పృథ్వీరాజ్ ఉన్నారని నెటిజన్లు అంటున్నారు. వీళ్ళని నెటిజన్లు దండుపాళ్యం బ్యాచ్ తో పోల్చుతూ పోస్ట్ లు పెడుతున్నారు. హౌస్ లో ఉన్న దండుపాళ్యం బ్యాచ్ వీళ్ళే. ఇతరులని కనికరం లేకుండా టార్గెట్ చేస్తున్నారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. రీసెంట్ గా జరిగిన మెగా చీఫ్ కంటెండర్స్ టాస్క్ లో నిఖిల్, ప్రేరణ కలసి టేస్టీ తేజపై దారుణంగా అటాక్ చేశారు.
టేస్టీ తేజని, హరితేజని టార్గెట్ చేసి మరీ పోటీ నుంచి తప్పించారు. తేజ కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చేశాడు. దండుపాళ్యం బ్యాచ్ తేజని టార్గెట్ చేసారు అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మరోవైపు గౌతమ్ ని యాష్మి, ప్రేరణ అసలు టీంలో లేకుండా చేశారు. తేజ ఓడిపోయినా కూడా అతను ఆడిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత తేజ ఏడుస్తూ బాధపడటంతో గంగవ్వ ఓదార్చింది. కొంచెం స్టామినా ఉంటే బావుండేది ఇంకాసేపు అయినా ఆడేవాడిని.. ఎప్పుడూ ఇలానే చివరి వరకూ వచ్చి పోతున్నా” అంటూ బాధపడ్డాడు తేజ
EPS New System : ఉద్యోగుల పెన్షన్ స్కీం తో పాటు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. 2025…
Rice Water : ప్రస్తుత కాలంలో చాలా మంది తమ జుట్టు ఆరోగ్యం కోసం సహజ పద్ధతులను మరియు ఇంటి చిట్కాలపై…
TG Govt Skills University Jobs : ప్రపంచస్థాయి నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా…
Pumpkin Seeds : గుమ్మడి గింజలు అనేవి చూడటానికి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కానీ వీటిని ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో…
Tulasi Vivaham : హిందూమతంలో తులసి శ్రీ మహావిష్ణువు రూపమైన శాలి గ్రాముల వివాహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక…
Work From Home Jobs : ఇంట్లో ఇద్దరు జాబ్ చేస్తేనే కానీ ఇల్లు గడవని పరిస్థితి ఉంది. ఎంత…
Telangana : తెలంగాణలో నిరుద్యోగ యువత పెరిగింది. నిరుద్యోగంలో దేశంలో రాష్ట్రం ముందుంది. రాష్ట్రంలోని 15 నుండి 29 సంవత్సరాల…
Nagula Chavithi : కార్తీక మాసంలో శుద్ధ శుక్ల పక్ష చవితి రోజున నాగుల చవితిని జరుపుకుంటారు. ఈ ఏడాది…
This website uses cookies.