Bigg Boss Geetu : బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్-6 విజయవంతంగా సాగుతోంది. అయితే,కంటెస్టెంట్ల ఆట తీరు బాగా లేకపోవడంపై అటు ఆడియెన్స్, ఇటు మేనెజ్మెంట్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. సీజన్ -5లో సిరి-షణ్ముక్ చేష్టల వలన అది ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఏకంగా నాలుగేళ్ల షన్నూ-దీప్తి లవ్ ఒక్కసారిగా బ్రేకప్ అయ్యేవరకు వెళ్లింది. రేటింగ్స్ విషయంలోనూ నాడు బిగ్ బాస్ దుమ్మురేపింది. బిగ్ బాస్ సీజన్-6లో కంటెస్టెంట్ల మొహాలు పెద్దగా ఎవరికి తెలిసినట్టు కనిపించడం లేదు.దీంతో ఈ రియాల్టీ షో చూసేవారు తగ్గిపోయారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ రేటింగ్స్ కూడా దారుణంగా పడిపోతున్నట్టు తెలుస్తోంది. ఇదే రిపీట్ అవుతే వచ్చే సీజన్ డౌట్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
హోస్ట్ నాగార్జున, బిగ్‌బాస్ నిర్వాహకులు రేటింగ్స్ విషయంలో ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఇక సీజన్-6లో కంటెస్టెంట్ల విషయంలోనూ హోస్ట్ నాగార్జున చాలా ఆగ్రహంగా ఉన్నారట.. ఎవరూ సరిగా గేమ్ ఆడటం లేదని రీసెంట్ గా క్లాస్ కూడా పీకారట.. దాంతో కాస్త ఇంట్లోని సభ్యుల్లో మార్పు కనిపించిందని టాక్ వినిపిస్తోంది. గత సీజన్లో సభ్యులు చేసిన పనికి జనాలకు నిజంగానే పిచ్చెక్కిందని తెలిసిందే. ఈ సారి మాత్రం కాస్త వల్గారిటీ తగ్గినా సభ్యుల ఓవరాక్షన్ షో ఇమేజ్‌ను డౌన్ చేసిందని తెలుస్తోంది. ఈ సీజన్ లో గలాటా గీతూ పేరు మాత్రం బాగా వినిపిస్తోంది. వదురుబోతు అని ఎప్పుడూ లడలడ వాగుతూనే ఉంటుందని ఆమెకు పేరుంది.
కానీ ఆమె ప్రవర్తనలో కాస్త మార్పు కనిపించిందని అంటున్నారు. సింగర్ రేవంత్ కు బయట రియాల్టీని అర్థమయ్యేలా వివరించి మంచి మార్కులు కొట్టేసింది. ఏదైనా నువ్వు చేసేముందు పక్కవాళ్లు ఏమనుకుంటారో ఆలోచించి చేయాలని.. లేదంటే వారికి నీపై, నీతో ఉన్నవారిపై చెడు అభిప్రాయం కలుగుతుందని చెప్పింది.. ఒకవేళ నువ్వు నన్ను ముద్దుపెట్టుకున్నావ్ అనుకో.. అది నాకు ఇష్టం ఉండి పెట్టుకుంటే ప్రాబ్లమ్ లేదు.. మొన్న ఫైమా కాళ్ల మీద పడుకున్నావు. తనకు ఇబ్బంది లేకపోతే ఏంకాదు. ఇబ్బంది ఉంటే నువ్వు చేసింది తప్పు అని చెప్పడంతో రేవంత్ కూడా అంగీకరించాడు’ .. దీంతో వారి మధ్య స్నేహం చిగురించింది.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.