Home » Entertainment » Bigg Boss Ott Latest Promo Released
Entertainment

Bigg Boss OTT : నాన్‌స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌.. బిగ్ బాస్ ప్రోమోతో పెరిగిన అంచ‌నాలు

Authored By
Sam C
The Telugu News | Updated on: February 21, 2022, 8:19 pm
Advertisement

Bigg Boss OTT : బిగ్ బాస్ షో ప్ర‌స్తుతం బుల్లితెర‌పై అనేక సెన్సేష‌న్స్ క్రియేట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఓటీటీ షోకి కూడా రంగం సిద్దం చేస్తున్నారు. ఇప్ప‌టికే హిందీలో ఈ టాక్ షో ర‌చ్చ చేయ‌గా, త‌మిళం, తెలుగులోను ఓటీటీ షో కేక పెట్టించ‌బోతుంది. త‌మిళం షో ఇప్ప‌టికే మొద‌లు కాగా, ఫిబ్ర‌వ‌రి 26న తెలుగు ఓటీటీ మొద‌లు కానుంది. బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షో ఓటీటీ స్ట్రీమింగ్ కు సర్వం సిద్ధం చేశారు. ఈ సారి హౌజ్ లుక్ చాలా గ్రాండ్ గా కనిపించనుంది. గతంతో పోల్చుకుంటే మరిన్ని సౌకర్యాలతో హౌజ్ ముస్తాబైంది. ఇప్పటికే ఫైనల్ లిస్ట్ జాబితా నెట్టింట చక్కర్లు కొడుతుండగా ఈ నెల 26 నుంచి షో స్ట్రీమింగ్ షురూ కానుంది.బిగ్ బాస్ ఓటీటీ ఫైనల్ లిస్ట్ జాబితా కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Advertisement

ఈ జాబితాలో అరియానా గ్లోరీ, ఆషురెడ్డి, ముమైత్‌ ఖాన్, హమీద, సరయు వంటి హాట్‌ భామలు ఎక్కువగా కనిపిస్తున్నారు. మరొవైపు కొందరు కంటెస్టెంట్ల ఫేసులు కూడా రివీల్‌ అయిపోయాయి. బిగ్‌బాస్‌ స్టేజ్‌పై కంటెస్టెంట్ల ఇంట్రో పర్‌ఫామెన్సుల వీడియో క్లిప్పింగులు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ పేరుతో ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌’లో ఈ నెల 26నుంచి ఈ షో స్ట్రీమింగ్‌ కానుంది. యథావిథంగా ఈసారి కూడా హోస్ట్‌గా కింగ్‌ నాగార్జుననే వ్యవహరించనున్నారు.నో కామా, నో పులిస్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్‌ అంటూ ప్రోమోను వదిలిన మేకర్స్‌ అందుకు తగ్గట్లుగానే షోను ప్లాన్‌ చేస్తున్నారు.

Bigg Boss ott Latest promo released

Advertisement

మరి ఈసారి ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న బిగ్‌బాస్‌ షో ఎలా ఉండబోతుందో చూడాలి. మరోవైపు ప్రేక్షకులు కూడా ఈ షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ ఓటీటీకి సంబంధించి ప్రోమో విడుద‌ల చేశారు. ఫిబ్ర‌వ‌రి 26 సాయంత్రం 6 గంట‌ల నుండి ఈ షో ప్రారంభం కానుందని తెలియ‌జేస్తూ.. మీ మొబైల్స్ ఫుల్ చార్జింగ్ పెట్టుకోవాల‌ని నాగార్జున అన్నారు. బిగ్ బాస్ ఇప్పుడు నాన్ స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అంటూ నిర్వాహ‌కులు తెలియ‌జేశారు. తాజాగా విడుద‌లైన ప్రోమో సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి