bigg boss ott Telugu nonstop no1 bindhu madhavi and no2 hameeda
Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్‌బాస్ నాన్ స్టాప్ లెక్కలు మెల్ల మెల్లగా మారిపోతున్నాయి. షో ప్రారంభం సమయంలో ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. కానీ కంటెస్టెంట్స్ విషయంలో ఎప్పటి లాగే పెదవి విరిచి.. వీళ్లేం కంటెస్టెంట్స్.. వీళ్లు ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేస్తారా అంటూ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అదే కంటెస్టెంట్స్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేయడంతో పాటు షో కు మంచి రేటింగ్ దక్కేలా చేస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో కి సంబంధించిన హడావుడి ట్విట్టర్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారం పై చాలానే కనిపిస్తుంది.
ఇక ఇప్పటికే బిగ్బాస్ నెం.1 అంటూ హీరోయిన్ బిందు మాధవిని జనాలు నెత్తిన పెట్టుకొని మరీ పూజిస్తున్నారు. ఆమె ఖచ్చితంగా ఈసారి విజేతగా నిలుస్తుంది అంటూ ప్రతి ఒక్కరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఆమె అభిమానులు ట్విట్టర్లో ఏకంగా బిందుమాధవి ఆర్మీ అంటూ ఏర్పాటు చేసి ఆమె నామినేట్ అయిన ప్రతి సారీ గంపగుత్తగా లక్షల కొద్ది ఓట్లు వేస్తున్నారు. బిగ్ బాస్ తాజా ఎపిసోడ్ ద్వారా బిందు మాధవి నెంబర్ వన్ అయితే నెంబర్ 2 స్థానంలో హమీద ఉంటుంది అంటూ ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
bigg boss ott Telugu nonstop no1 bindhu madhavi and no2 hameeda
గత సీజన్లో ఎక్కువ యాక్టివ్గా కనిపించ లేదు కానీ సీనియర్ అవ్వడం వల్లనో ఏమో కానీ ఆమె జోష్ పెంచింది. గతంతో పోలిస్తే ఈ సీజన్ లో చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది. అంతే కాకుండా తనదైన సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తుంది. భారీగా అందాల విందు చేయడంతో పాటు ప్రతి ఒక్కరి తో సన్నిహితంగా ఉంటూ అందరిలో మంచి పేరు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజా ఎపిసోడ్ లో ఆమె అరియానాతో పెట్టుకున్న గొడవ ఆమె యొక్క పాపులారిటీని మరింతగా పెంచింది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా బిందుమాధవి తర్వాత స్థానం హమీదాదే అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
Allu Ajun : ఐకన్ స్టార్ అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందనే ప్రచారం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన పాలన శైలిని ప్రజల ముందు ఉంచారు. చిత్తూరు…
Green Chicken Curry : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కొత్త వంటకాన్ని ట్రై చేసి చూడాలి అనుకుంటారు.…
Hari Hara Veera Mallu Movie Trailer : తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోగా వెలుగొందుతున్న పవర్స్టార్ పవన్…
Ram Charan Fans : 'ఆర్.ఆర్.ఆర్' సినిమా తరువాత, పలు నిర్మాతలు రామ్ చరణ్తో సినిమాలు చేయాలని ఆసక్తి చూపినా,…
Buddhas Hand : ప్రపంచం లో ఇలాంటి ప్రత్యేకమైన పండు ఒకటి ఉందని మీకు తెలుసా. ఈ పండుని చాలా…
This website uses cookies.