
Bigg Boss OTT Winner, Runner Who Knows
Bigg Boss OTT Telugu : ఏదైనా పని చేస్తున్నప్పుడు దానికి తగ్గ ఫలితం వస్తే ఆ పనిపై ఆసక్తి కలుగుతుంది. కానీ ఆ పని వల్ల ఫలితం లేనప్పుడు ఆదాయం రానప్పుడు చేసి ఎందుకు అని అంతా అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు అదే అనుకుంటున్నారేమో అంటూ బిగ్ బాస్ ప్రేక్షకులు అసంతృప్తితో ఉన్నారు. ఆర్బాటంగా బిగ్బాస్ నాన్ స్టాప్ ని ప్రారంభించిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఇప్పుడు మెల్ల మెల్లగా వదిలించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ అనిపిస్తుందని అందుకు ఇవే సాక్షాలు అంటూ కొందరు నెటిజెన్స్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి.
ఇటీవల ఒక రోజు ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేయడం దాదాపు మూడు గంటల ఆలస్యమైంది. సాధారణ ఎపిసోడ్ టీవీ లో టెలికాస్ట్ అవ్వడం లేట్ అయితే ఏ స్థాయిలో రచ్చ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మూడు గంటలు ఆలస్యం అయినా కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇలా మూడు గంటలు ఆలస్యంకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారి అలసత్వం కారణం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం ఎడిటింగ్ విషయంలో ఆలస్యం అయి ఉంటుంది అంటున్నారు.
Bigg Boss OTT Telugu nonstop fans angry on Disney Plus Hot Star ott
మరో వైపు ఒక రోజు రెండు ప్రోమోలు రిలీజ్ చేస్తే మరో రోజు ఒక్క ప్రోమో తోనే సరిపెడుతున్నారు. స్టార్ మా టీవీలో ప్రసారమైన సమయంలో కచ్చితంగా రెండు ప్రోమో లను విడుదల చేసే వారు. కానీ ఇప్పుడు మాత్రం అలా చేయడం లేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోమో తో నెట్టుకొస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారికి ఈ షోపై మెల్ల మెల్లగా ఆసక్తి తగ్గుతుందని అంటున్నారు. మరో వైపు ప్రేక్షకుల్లో ఈ షో కి ఆదరణ పెరుగుతుండడంతో విశేషం. ఆదాయం రావడం లేదని వాళ్ళు వదిలించుకునే ప్రయత్నం చేస్తుంటే.. ప్రేక్షకులు మాత్రం ఆదరిస్తూనే వున్నారు అంటూ బుల్లి తెర విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.