
social media trolls on Bigg Boss OTT Telugu and show team
Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్బాస్ నాన్ స్టాప్ మెల్ల మెల్లగా ప్రేక్షకులకు ఎక్కుతోంది. దాదాపుగా రెండు వారాల పాటు ఈ షో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. నిర్వాహకులు కంటెస్టెంట్స్ హౌస్ లో గొడవలు పడతారో లేదో అనే ఉద్దేశంతో స్వయంగా వారు గొడవలు పడేలా రెండు టీంలుగా విడదీయడం జరిగింది. కొత్త వారు పాత వారు వేర్వేరుగా ఛాలెంజర్స్ మరియు వారియర్స్ అని టీములుగా ఉండాలి. రెండు వారాలుగా ఆ రెండు టీమ్ లకు టాస్క్ లు ఇస్తూ వస్తున్నారు.ఎట్టకేలకు రెండు టీమ్ లు.. అందుకు సంబంధించిన గొడవలకు తెరదించడం జరిగింది. స్టాండప్ రాహుల్ అనే సినిమా ప్రమోషన్ లో భాగంగా రాజ్ తరుణ్ మరియు వర్ష బొల్లమ్మ లు హౌస్ లోకి వెళ్లారు.
ఆ సందర్భంగా కంటెస్టెంట్స్ సరదాగా వారిద్దరిని నవ్వించడంతో పాటు వారిద్దరితో ఆటలాడుతూ ఎంజాయ్ చేశారు. వర్ష బొల్లమ్మ అక్కడి నుండి వెళ్ళి పోయే సమయంలో ఇప్పటి తో ఛాలెంజర్స్ మరియు వారియర్స్ అనే కాన్సెప్ట్ పూర్తి అయిపోయింది.. ఇక నుండి అంతా కలిసి ఉండవచ్చు అంటూ ప్రకటించి వెళ్ళింది.బిగ్ బాస్ హౌస్ లో గొడవలు అనేది చాలా కామన్ గా జరుగుతుంటాయి. ఆ గొడవలు చాలవు అన్నట్లుగా నిర్వాహకులు ఏకంగా కంటెస్టెంట్స్ ను టీం లుగా విడదీసి గొడవ పడండి అంటూ హౌస్ లోకి పంపించడంతో ప్రేక్షకులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. షో పూర్తయ్యే వరకు ఛాలెంజర్స్ మరియు వారియర్స్ కాన్సెప్ట్ ఇలాగే ఉంటుందా ఏంటి అని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
Bigg Boss OTT Telugu nonstop latest episode news
కానీ ఎట్టకేలకు మూడవ వారం ప్రారంభానికి ఛాలెంజర్స్ మరియు వారియర్స్ కాన్సెప్ట్ ని తొలగిస్తున్నట్లు గా ప్రకటించడంతో ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుండి ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా ఇప్పటి వరకు రెండు టీమ్ లు అన్నట్లుగా పోటీపడ్డారు. ఇక మీదట వారియర్స్ మరియు చాలెంజర్స్ కాన్సెప్ట్ లేదు కాబట్టి కాస్త గొడవలు తగ్గే అవకాశాలు ఉన్నాయంటూ బిగ్బాస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. షో ముందు ముందు అయినా మంచి వ్యూస్ ను దక్కించుకుంటుందా అనేది చూడాలి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.